news18-telugu
Updated: December 2, 2020, 9:10 AM IST
సన్నీ డియోల్
మన దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు. మరికొందరు మరణిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సన్నీడియోల్ కొంతకాలంగా హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఉంటున్నారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని.. హిమాచల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమితాబ్ అవస్థి వెల్లడించారు. సన్నీడియోల్ ఇటీవలే కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన కొద్దిరోజులుగా కులూలోని తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ముంబైకి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలోన డియోకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
సన్నీ డియోల్ బీజేపీ తరపున 2019 ఎన్నికల్లో గురుదాస్‌పూర్ లోక్‌సభ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిదే. ఇక 2007లో విడుదలైన తన హిట్ మూవీ అప్నే(Apne)కు ఇటీవలే సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్నే-2లో ధర్మేంద్ర, ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌తో పాటు సన్నీ డియోల్ కుమారుడు కరన్ డియోల్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్లో ఒక సినిమాలో మూడు తరాలకు చెందిన నటులు కలిసి నటించడం ఇదే తొలిసారి.
''మీ ప్రేమ, బాబాజీ ఆశీర్వాదంతో త్వరలోనే మనందరం మళ్లీ కలుద్దాం. మా తండ్రి, సోదరుడితో పాటు ఈసారి నా కుమారుడితో కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. 2021 దీపావళికి అప్నే-2 మూవీ 2021 దీపావళికి థియేటర్లలో విడుదలవుతుంది.'' అని డిసెంబరు 30న సన్నీ డియోల్ ట్వీట్ చేశారు.
అప్నే-2 చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అప్నే చిత్రాన్ని కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. ఇక ఈ మూవీకి దీపక్ ముకుట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక సన్నీ డియోల్ కుమారుడు కరన్ డియోల్.. గత ఏడాది 'పల్ పల్ దిల్ కే' పాస్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేశారు. ఈ మూవీ తర్వాత తన ఫ్యామిలీ కథా చిత్రంలో అప్నే-2లో నటిస్తున్నాడు కరన్. ఇందులో తన తాత, తండ్రితో కలిసి నటించబోతున్నాడు.
Published by:
Shiva Kumar Addula
First published:
December 2, 2020, 8:53 AM IST