వైఎస్ వివేకా హత్యకేసులో పరమేశ్వర రెడ్డిపై అనుమానాలు: సునీతా రెడ్డి

మరోవైపు తన తండ్రి హత్య కేసులో పరమేశ్వర రెడ్డి వ్యవహారం అనుమానాస్పందగా ఉందన్నారు సునీతరెడ్డి. వివేకా హత్య జరిగిన రోజే పరమేశ్వర రెడ్డి ఆస్పత్రిలో చేరానన్నారు.

news18-telugu
Updated: March 27, 2019, 12:07 PM IST
వైఎస్ వివేకా హత్యకేసులో పరమేశ్వర రెడ్డిపై అనుమానాలు: సునీతా రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
  • Share this:
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో అనేక అనుమానాలున్నాయన్నారు ఆయన కూతురు సునీతా రెడ్డి. ఈనెల 15న వైఎస్ వివేకా పులివెందులలో తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ రోజు ఉదయం. 6:40 లకు తమకు తండ్రి మృతికి సంబంధించి సమాచారం అందిందన్నారు. డెత్ స్పాట్‌లో ఏం జరిగిందో సీఐకి తెలుసన్నారు. మరోవైపు తన తండ్రి హత్య కేసులో పరమేశ్వర రెడ్డి వ్యవహారం అనుమానాస్పందగా ఉందన్నారు సునీతరెడ్డి. వివేకా హత్య జరిగిన రోజే పరమేశ్వర రెడ్డి ఆస్పత్రిలో చేరానన్నారు. ఆ రోజు సాయంత్రమే ఆస్పత్రి సిబ్బందితో గొడవకు దిగి డిశ్చార్జ్ అయ్యారని ఆరోపించారు. జమ్ములముడుగు నియోజకవర్గంలో నేతలందరితోనే తన తండ్రికి దగ్గరి సంబంధాలున్నాయన్నారు సునీత.
ఈ విషయం ఆదినారాయణ రెడ్డి వర్గానికి బాగా తెలుసన్నారామె. జగన్‌ను సీఎం చేయాలని తన తండ్రి ఎంతగానే కష్టపడ్డారన్నారు. నష్టపోయింది తన ఫ్యామిలీ అయతే.. మళ్లీ తమ కుటుంబంపైనే నిందలేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకుటున్నారని విమర్శించారు.

ఇప్పటికే ఈ హత్య కేసు విచారణపై ఆయన కుటుంబ సభ్యుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ సహా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతా రెడ్డి కేసు విచారణ జరుగుతున్న తీరుపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టును ఆశ్రయించిన వివేకా సతీమణి సౌభాగ్యమ్మ.. కేసును విచారిస్తున్న ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. సునీతా రెడ్డి కూడా తన తండ్రి మరణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు.

First published: March 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>