పంజాబ్ (Punjab) కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా (resign) తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూపై చేసిన దేశద్రోహ ఆరోపణలతో పంజాబ్ రాజకీయం కాక పుట్టిస్తుంది. మరోవైపు తదుపరి ముఖ్యమంత్రి (Punjab Next chief minister) ఎంపిక అంశం జనపథ్ కి చేరింది. ఇక సీల్డ్ కవర్ సీఎం ఎవరనేది తేలాల్సి ఉంది. కాగా, సీఎం పదవి కోసం రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. అంబికా సోనీ, సునీల్ జాఖర్ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఇపుడు మరో కొత్త పేరు సీఎం రేసులో ముందుకొచ్చింది. ఎమ్మెల్యేలు కూడా ఆయనకు మద్దతిస్తున్నట్లు అధిష్టానానికి తెలియజేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాతో తెలిపారు. ఆయన ఎవరంటే.. మంత్రి సుఖ్జీందర్ సింగ్ రంధావా (Sukhjinder singh radhawa).. అంతేకాదు ఇటీవల అమరీందర్‌పై కూడా రంధావా విమర్శలు గుప్పించారు. ప్రజల మద్దతు లేనిదే ఎవరూ ముఖ్యమంత్రి (Chief minister)గా కొనసాగలేరని చురకలంటించారు. కాగా, ముఖ్యమంత్రితో పాటు కొత్తగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు తెలిసింది. ఒక హిందువు, ఒక దళిత వ్యక్తిని డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
Congress leader Rahul Gandhi returns to his residence after meeting party president Sonia Gandhi
Punjab Congress political developments | Captain Amarinder Singh had yesterday resigned as Punjab CM, and Sukhjinder Singh Randhawa is likely to be the new CM. pic.twitter.com/mdPY8ozZxX
— ANI (@ANI) September 19, 2021
ఎవరీ సుఖ్జిందర్ సింగ్ రాంధవా?..
సుఖ్జిందర్ సింగ్ రాంధవా (Sukhjinder singh radhawa) 25 ఏప్రిల్ 1959లో జన్మించాడు. పంజాబ్ శాసనసభ సభ్యుడు (MLA). డేరా బాబా నానక్ (dera baba nanak) నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. పంజాబ్ సీఎం అమరీందర్ ప్రభుత్వంలో రాష్ట్ర జైళ్లు, సహకార సంఘాల క్యాబినెట్ మంత్రి (cabinet minister)గా పనిచేస్తున్నాడు. అంతేకాదు ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా (vice president) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కొత్త సీఎం అభ్యర్థి గురించి కాంగ్రెస్ నాయకుడు కాకా రణ్‌దీప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను ఆయన్ని కలవాలి. అధికారిక ప్రకటన మాత్రం ఢిల్లీనుంచి వస్తుంది అన్నారు.
I have come to meet him (Sukhjinder Singh Randhawa), official information (on CM's name) will be announced by people who have come from Delhi through a presser: Congress leader Kaka Randeep Singh pic.twitter.com/IAgoBPwtHE
— ANI (@ANI) September 19, 2021
సిద్ధూపై ఆరోపణలతో..
అమరీందర్, సిద్దూ అంతర్గత పోరు సీఎం రాజీనామా వరకు దారితీసింది. పోతూ పోతూ మాజీ సీఎం అమరీందర్ కూడా సిద్ధూపై సంచలన ఆరోపణలు చేసి పోయారు. సిద్ధూకి పాక్‌తో సంబంధాలు ఉన్నాయని, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్యాలతో స్నేహం ఉందని ఆరోపించారు. సిద్ధూ సీఎం అయితే దేశ భద్రతకే ప్రమాదం వాటిల్లుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సిద్ధూని కాదని మరొకరికి సీఎం పదవి అప్పగించే ఆలోచనలో ఉంది. దానిలో భాగంగానే సుఖ్జిందర్ సింగ్ రాంధవా ను ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిగా అధిష్టానానికి సూచించినట్లు తెలిసింది.
Two deputy CMs will be appointed along with CM in Punjab. 1 Hindu and 1 Dalit MLA to be appointed for the post: Sources
— ANI (@ANI) September 19, 2021
అంబికా సోనీని అడిగినా..
కాంగ్రెస్ సిద్ధూని ముఖ్యమంత్రిని చేస్తే అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పై విరుచుకు పడటానికి కెప్టెన్ వ్యాఖ్యలు అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిద్ధుని కాకుండా సిక్కుయేతర నేతని ముఖ్యమంత్రిగా చేస్తే ఉపయ తారకంగా ఉండి అమరేందర్ సింగ్ వర్గాన్ని కూడా సంతృప్తి పరచవచ్చని కాంగ్రెస్ భావిచింంది. దీనిలో భాగంగా మొదట్లో సునీల్ జాఖర్ పేరు వినిపించినా.. తర్వాత అంబికా సోనిని సీఎంగా ఉండాలంటూ అధిష్టానం అడిగినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తను ముఖ్యమంత్రి పదవి చేపట్టలేనని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అందుకే రంధావా వైపు అధిష్టానం చూస్తున్నట్లు తెలిసింది. మరోవైపు అమరీందర్ పనితీరును విమర్శించిన నేతల్లో ఆయన ఒకరు. ఎమ్మెల్యేల మద్దతూ ఉండటంతో రంధావాకు సీఎం పీఠం దక్కే అవకాశాలు మెండు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.