Home /News /politics /

SUJANA CHOWDARY TRYING TO BE IN PM MODIS GOOD LOOKS SAYS TDPS VARLA RAMAIAH BA

సుజనా చౌదరి ప్లాన్ ఇదే అయ్యి ఉండొచ్చు... టీడీపీ నేత డౌట్..

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పినట్టు రాజధాని విషయం కేంద్రం పరిధిలోని అంశం అనడం పార్టీ అభిప్రాయం కాదని ఏపీ బీజేపీ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చెప్పినట్టు రాజధాని విషయం కేంద్రం పరిధిలోని అంశం అనడం పార్టీ అభిప్రాయం కాదని ఏపీ బీజేపీ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.

సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరినప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. దానిపై పురోగతి లేదు.

    బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ మీద పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ మీద మతపరమైన ఆరోపణలతో పాటు తాజాగా టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు, వైసీపీ నుంచి కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సుజనా చౌదరి చెప్పారు. సుజనా వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ఈ క్రమంలో అసలు సుజనా చౌదరి పదే పదే తమ మీద విమర్శలు చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందనే విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వెల్లడించారు.

    ‘సుజనా చౌదరి బీజేపీలోకి వెళ్లారు కదా. ఏదో ఉబలాటపడుతున్నారు. నేనేదో చేస్తున్నానని ప్రధాని వద్ద ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. తన సత్తా చూపించుకోవాలనుకుంటున్నారు. ఆయన వెళ్లినదగ్గరి నుంచి ఇదే ప్రయత్నం చేస్తున్నారు. మా నాయకులు, ఎమ్మెల్యేలు మా నాయకుడితోనే ఉంటారు. అయినా, కన్నతల్లిలాంటి టీడీపీని వదలి సవతితల్లి లాంటి బీజేపీలోకి ఎవరూ చేరరు.’ అని వర్ల రామయ్య అన్నారు.

    సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరినప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆ తర్వాత అది వెనక్కిపోయింది. తాజాగా ఎన్డీయే నుంచి శివసేన వైదొలగడంతో ఓ మంత్రి పదవి ఖాళీ అయింది. ఈ క్రమంలో మళ్లీ మంత్రి పదవి దక్కించుకునేందుకు సుజనా చౌదరి ప్లాన్ చేసి ఉంటారనే చర్చ టీడీపీ, వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Ap bjp, AP Politics, Sujana Chowdary, Tdp

    తదుపరి వార్తలు