హోమ్ /వార్తలు /రాజకీయం /

నిమ్మగడ్డ రమేష్‌తో రహస్య భేటీపై సుజనా చౌదరి వివరణ

నిమ్మగడ్డ రమేష్‌తో రహస్య భేటీపై సుజనా చౌదరి వివరణ

సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్

సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయినట్టు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయన ఈ నెల 13న జరిగిన భేటీలో సుమారు గంటసేపు చర్చించినట్టు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతల భేటీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిమ్మగడ్డ, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా సమావేశమైనట్లు వీడియో బయటకు వచ్చింది. ఆ సీసీ ఫుటేజీ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. సుజనా, కామినేని బీజేపీలో ఉన్నా ఇప్పటికీ చంద్రబాబు మనుషులేనని.. అలాంటి వారితో నిమ్మగడ్డ ఎందుకు సమావేశమయ్యారు? ఏం మాట్లాడారో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిక ప్రైవేట్ హోటల్స్‌లో రహస్య భేటీలు ఏం అవసరమని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆ సమావేశంపై సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు. అది మర్యాదపూర్వక భేటీ అని.. అందులో తప్పేముందని న్యూస్ 18తో మాట్లాడారు.


  అందులో ఎలాంటి తప్పులేదు. మర్యాదపూర్వకంగానే వారిని కలిశాను. అర్ధం లేని వీడియో టేపులతో వైసీపీ నేతలు ఎందుకిత రాద్ధాంతం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరస్తుడు కాదు. ఆయన్ను కలవకూడదని రూల్ లేదు. మేం మంచి మిత్రులం. ఎక్కడైనా కలుస్తాం. ఎప్పుడైనా కలుస్తాం. ఇందులో తప్పేముంది. వైసీపీ నేతలు ఇలాంటి నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలి.

  సుజనా చౌదరి, బీజేపీ నేత

  నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయినట్టు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆయన ఈ నెల 13న జరిగిన భేటీలో సుమారు గంటసేపు చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం వివాదం నడుస్తుండగా రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో టీడీపీ నేతలెవరూ పాల్గొనకపోయినప్పటికీ... చంద్రబాబుకు సన్నిహితులుగా వైసీపీ పదే పదే ఆరోపించే బీజేపీ నేతలు సుజనా చౌదరి, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ కలిసి నిమ్మగడ్డను కలవడం హాట్ టాపిక్‌గా మారింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nimmagadda Ramesh Kumar, Sujana Chowdary

  ఉత్తమ కథలు