Home /News /politics /

SUJANA CHOWDARY BECOMES SILENT AFTER CENTRE DECISION ON AP THREE CAPITAL PROPOSAL AK

కేంద్రం నిర్ణయంతో సైలెంట్ అయిపోయిన బీజేపీ ఎంపీ

సుజనా చౌదరి

సుజనా చౌదరి

మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో సుజనా చౌదరి అందరికంటే ముందున్నారు.

    ఏపీ మూడు రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కేంద్రం కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది. పార్లమెంట్‌లోనే ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టింది. దీంతో ఏపీలోని అధికార పార్టీకి ఈ విషయంలో కేంద్రం నుంచి దాదాపుగా లైన్ క్లియర్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉన్నా... కేంద్రం ప్రకటనతో ఏపీ బీజేపీకి చెందిన నాయకుడు పూర్తి ఇరకాటంలో పడిపోయారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయన మరెవరో కాదు... టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న వారిలో సుజనా చౌదరి అందరికంటే ముందున్నారు.

    అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని పదే పదే సవాల్ చేశారు. ఈ విషయంలో సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని... అన్ని విషయాలు కేంద్ర పెద్దల దృష్టికి తాను తీసుకెళుతున్నానని ఆయన చెబుతూ వచ్చారు. అయితే రాజధానుల ఏర్పాటు అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం ప్రకటించనప్పటి నుంచి సుజనా చౌదరి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అంతకముందు వారానికోసారైనా మీడియా ముందుకు వచ్చి... రాజధాని మార్పు సాధ్యంకాదని చెప్పుకుంటూ వచ్చిన సుజనా చౌదరి... ఇప్పుడు మాత్రం దీనిపై మాట్లాడటం లేదు. మొత్తానికి ఏపీ రాజధాని రగడపై కేంద్రం చేసిన ప్రకటన ఆ పార్టీ ఎంపీ నోటికి తాళం వేసిందనే ప్రచారం జరుగుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amaravati, Andhra Pradesh, Bjp, Sujana Chowdary, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు