AP Politics: ఏపీలో ఆ ఇద్ద‌రు నేత‌లు ఏమ‌య్యారు..? వారి మౌనం వెనుక కారణం ఇదేనా..?

సీఎం రమేష్, సుజనా చౌదరి (ఫైల్)

AP Politics: పాలిటిక్స్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారం ఉంటే అందలం.. లేకుంటే ఏమీ చేయలేం అనే పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడికి ఎదురవుతుంది.

  • Share this:
    M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

    పాలిటిక్స్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అధికారం ఉంటే అందలం.. లేకుంటే ఏమీ చేయలేం అనే పరిస్థితి ప్రతి రాజకీయ నాయకుడికి ఎదురవుతుంది. కొంతమంది నేతలకు వారు తీసుకునే నిర్ణయాలే ప్రతికూలంగా మారుతుంటాయి. ప్ర‌స్తుతం ఈ ప‌రిస్థితి ఆంధ్రప్రదేశ్ లోని ఆ ఇద్ద‌రు నేత‌ల‌కు బాగా అర్ధమైనట్లు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల త‌రువాత ఎదో ఆశించి పార్టీ మారితే... అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌కు వారు ఆశించిన లబ్ధి చేకూరకపోవడంతో ఏమీ చేయలేక మౌన‌మే బెస్ట్ అనుకుంటున్నార‌ట. అధికారంలో ఉండగా ఓ వెలుగువెలిగి అన్నింటా తామే అనిపించుకున్న నేతలు ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. అస‌లు ఎవ‌రా నేత‌ల‌నుకుంటున్నారా..? వాళ్లే 2019 లో టీడీపీ ఘోర ప‌రాభ‌వం తరువాత బిజేపీ కండువా కప్పుకున్న ఎంపీలు సీఏం ర‌మేష్, సుజాన చౌద‌రి. అయితే అప్పుడు బీజేపీ కండువా కప్పుకున్న‌ప్పుడు వాళ్ల‌కు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టి కూడా అమ‌లు కాక‌పోవ‌డంతో గ‌త కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయారు. టీడీపీ నుంచి బీజేపీ వెళ్లేట‌ప్పుడు పార్టీలో స‌ముచిత స్థానం ఇస్తామ‌ని ఆ పార్టీ పెద్దల నుంచి హామీ వచ్చింది.

    అయితే ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరి రెండేళ్లు కావొస్తున్నా.. అధిష్టానం అసలు తమను పట్టించుకోవడం లేదని స‌న్నిహితులు ద‌గ్గ‌ర వాపోతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే తాజా కేంద్ర కేబినేట్ లో మార్పుల చేర్పులు ఉంటాయ‌ని వార్త‌లు వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్ర‌యోజ‌నం లేకోపోవ‌డంతో సైలెంట్ అయ్యిపోయార‌ట. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక వెలుగు వెలుగిన నేత‌లు ఇప్పుడు బిజేపీలోకి వెళ్లిన త‌రువాత అస‌లు ఉన్నారా లేరా అన్న‌ట్లు ఉండ‌డం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

    ఇది చదవండి: ఏపీలో మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు.. కొత్త డేట్స్, రూల్స్ ఇవే..


    మరోవైపు పదవుల విషయంలో కేంద్ర పెద్దల నుంచి మొండిచేయి ఎదురైనా ఈ ఇద్ద‌రు నేత‌లు మాత్రం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా త‌మ ప్ర‌యత్నాలు చూస్తూనే ఉన్నార‌ని టాక్. కేంద్రంలో త‌మ‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తే ఏపీలో పార్టీని మరింత బ‌ల‌పేతం చేయ‌గ‌ల‌గుతామ‌ని కేంద్ర పెద్ద‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తోన్నార‌ట. అయితే ఇప్ప‌టికే ఏపీ పార్టీ జాతీయ స్థాయి వ్య‌వ‌హారాల‌ను జీవీఎల్ చూసుకుంటున్నారు ఆయ‌న కూడా ఏపీ నుంచి త‌న‌కు కేబినేట్లో స్థానం క‌ల్పిస్తారిని భావించిన‌ట్లు తెలుస్తోంది. అయితే అది జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ఆయ‌న కూడా పార్టీ వ్య‌వ‌హారాల ప‌ట్ల సైలెంట్ అయ్యార‌ని స‌మ‌చారం.

    ఇది చదవండి: కారులో యువకుడి డెడ్ బాడీ.., పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు.. చంపింది వీళ్లేనా..?


    జీవీఎల్ కూడా సైలెంట్ అవడంతో తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దులో భాగంగానే నెల‌లో చాలా రోజులు ఢిల్లీలోనే మకాం వేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
    Published by:Purna Chandra
    First published: