రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో కాంట్రోవర్సీ సినిమా ‘కడప రాజ్యంలో కమ్మ రెడ్లు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటను వర్మ విడుదల చేశారు. దీంతో ఈ పాట తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు తీసింది. అయితే ఈ సినిమాలో పలువురు ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రలు కనిపించనున్నాయి. ఈ సినిమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషించారా? అన్న విషయం అటు జగన్ అభిమానులతో పాటు.. వర్మ ఫ్యాన్స్‌లో ఆతృత కలిగించింది. దీంతో ఈ సస్పెన్స్‌కు చెక్ పెడుతూ జగన్ పాత్రలో నటుడు అజ్మల్ నటిస్తున్నాడన్న వార్తలు తెరపైకి వచ్చాయి.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో జగన్ పాత్రలో నటిస్తున్న అజ్మల్
అతని స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి. అచ్చం జగన్ మాదిరిగానే నమస్కారం పెడుతూ...నవ్వుతూ కనిపిస్తున్న అజ్మల్ స్టిల్ ఫోటోలను చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలో వైరల్ అవుతున్నాయి. అంతుకుముందు వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో కూడా అచ్చుగుద్దినట్లు కనిపించే ఆర్టిస్టులతో సినిమాను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. మరి కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Published by:Sulthana Begum Shaik
First published:October 24, 2019, 11:36 IST