'ఖబడ్దార్ కేసీఆర్.. ' : ఇంటర్ బోర్డు వివాదంపై ప్రగతి భవన్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు

ప్రభుత్వం రీవాల్యూయేషన్ గడువు పెంచినప్పటికీ.. ఇప్పటికీ ఇంటర్ బోర్డు సైట్ ఓపెన్ కావట్లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. దానికి తోడు గంపగుత్తగా అన్ని సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ పెట్టుకోవడం తప్పితే.. ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేకంగా అవకాశం లేకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: April 24, 2019, 11:31 AM IST
'ఖబడ్దార్ కేసీఆర్.. ' : ఇంటర్ బోర్డు వివాదంపై ప్రగతి భవన్‌ను ముట్టడించిన విద్యార్థి సంఘాలు
ఇంటర్ బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన (File)
news18-telugu
Updated: April 24, 2019, 11:31 AM IST
ఇంటర్ బోర్డు అవకతవకలపై విద్యార్థి లోకం భగ్గమంటోంది. బోర్డు నిర్లక్ష్యానికి 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే.. ఇప్పటివరకు సీఎం స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పలు విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం డౌన్.. డౌన్.. అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ప్రగతి భవన్ లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

పోలీసులు పలువురు విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించగా.. సీఎం కేసీఆర్‌ను వారు హెచ్చరించారు. ఖబడ్దార్ కేసీఆర్.. అని హెచ్చరిస్తూ.. విద్యార్థులతో చెలగాటమాడవద్దని చెప్పారు. కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దృష్టిలో విద్యార్థులు దొంగలు, క్రిమినల్స్‌గా మారిపోయారని.. అందుకే ఇంత జరుగుతున్నా ఆయన స్పందించడం లేదని మండిపడుతున్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు వెళ్తే ఎవరూ స్పందించని నేపథ్యంలో.. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరినట్టు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. కాగా, ప్రభుత్వం రీవాల్యూయేషన్ గడువు పెంచినప్పటికీ.. ఇప్పటికీ ఇంటర్ బోర్డు సైట్ ఓపెన్ కావట్లేదన్న ఫిర్యాదులు అందుతున్నాయి. దానికి తోడు గంపగుత్తగా అన్ని సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ పెట్టుకోవడం తప్పితే.. ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేకంగా అవకాశం లేకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రూ.3600 చెల్లించి రీవాల్యుయేషన్‌కు వెళ్లడం విద్యార్థులకు భారంగా మారింది.First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు