ఏపీకి ప్రత్యేక హోదా... వినాయకుడికి వినతి పత్రం...

వినాయకుడికి వినతిపత్రం అందిస్తున్న విద్యార్థులు

ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మనసు మార్చాలని పలువురు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినాయకుడిని కోరారు.

  • Share this:
    ఏపీలోని కడప నగరానికి చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. ఏపీ ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మనసు మార్చాలని పలువురు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వినాయకుడిని కోరారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని వినాయకుడికి చేతిలో పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని కేంద్రం చెప్పడం సరికాదని... రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, మోదీ మనసు మార్చాలని కోరుతూ ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కడప నగరంలోని వినాయక విగ్రహానికి వినతిపత్రం ఇచ్చినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలియజేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: