స్కూల్లో జగన్ పాటలు.. విద్యార్థుల స్టెప్పులు.. ఏపీలో మరో దుమారం

వైసీపీ జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో డాన్స్‌లు చేయించారంటూ ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు లోకేష్.

news18-telugu
Updated: December 4, 2019, 3:28 PM IST
స్కూల్లో జగన్ పాటలు.. విద్యార్థుల స్టెప్పులు.. ఏపీలో మరో దుమారం
జగన్ పాటలకు విద్యార్థుల స్టెప్పులు
  • Share this:
ఏపీలో మొన్నటి వరకు ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, వైసీపీ రంగులు అంశాలపై దుమారం రేగింది. వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విపక్షాలు రోడ్డెక్కాయి. జగన్ అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగాయి. తాజాగా మరో అంశంపై సీఎం జగన్‌ను టార్గెట్ చేశారు మాజీ మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ పాటలు పెట్టడడంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ జెండా ఎత్తమంటూ ముక్కుపచ్చలారని పిల్లలతో డాన్స్‌లు చేయించారంటూ ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు లోకేష్.

ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసారా? లేకపోతే ప్ర‌భుత్వ గిరిజ‌న గురుకుల పాఠ‌శాల‌లో ఏంటీ సిగ్గుమాలిన ప‌నులు? అమ్మఒడి ఇస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకుని వైసీపీ బ‌డులు చేస్తున్నారా? వైసీపీ జెండా ఎత్త‌మంటూ ముక్కుప‌చ్చ‌లార‌ని పిల్ల‌ల‌తో ఆడించారు. రాయ‌ల‌సీమ ముద్దుబిడ్డ మ‌న జ‌గ‌న‌న్న అంటూ విద్యార్థుల‌తో పాడించారు. విద్యాశాఖా మంత్రి సాక్షిగా విద్యాల‌యాన్ని విష‌ప్ర‌చార నిల‌యం చేశారు.
నారా లోకేష్


మొన్న ఓ త‌హ‌సీల్దార్ తాగి మ‌న జ‌గ‌న‌న్న అంటూ గెంతులేశాడని... నిన్న‌ వంద‌లాది గిరిజ‌న విద్యార్థుల‌తో వైసీపీ ప్ర‌చార‌గీతాల‌కు స్టెప్పులేయించారని నారా లోకేష్ విమర్శించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌లో తెలుగుత‌ల్లి గీతాలాప‌న ర‌ద్దు చేసి వైకాపా పాట‌లు పెట్టేశారా అంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

First published: December 4, 2019, 3:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading