మాజీ మంత్రి నారాయణపై విద్యార్థుల దాడి.. చొక్కా పట్టుకొని..

విద్యార్థులను నారాయణ అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు నారాయణను చుట్టుముట్టి చొక్కా పట్టి లాగారు.

news18-telugu
Updated: December 3, 2019, 10:29 PM IST
మాజీ మంత్రి నారాయణపై విద్యార్థుల దాడి.. చొక్కా పట్టుకొని..
మాజీ మంత్రి నారాయణపై దాడి
  • Share this:
మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణకు చేదు అనుభవం ఎదరయింది. అనంతపురంలో నారాయణపై విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని నిలదీశారు. ఐతే విద్యార్థులను నారాయణ అనుచరులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు నారాయణను చుట్టుముట్టి చొక్కా పట్టి లాగారు. తోపులాటలో నారాయణ షర్ట్ చిరిగిపోయింది.

ఈ ఘటనతో నారాయణ అనుచరులు విద్యార్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్‌ను చొక్కా పట్టుకొని లాగుతారా అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు మాజీ మంత్రి నారాయణ కారుపై రాళ్లతో దాడి చేశారు. విద్యార్థుల దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారాయణ అనుచరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో నారాయణ అర్ధంతరంగా అనంతపురం పర్యటనను రద్దు చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.


First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>