మూత్రంతో యూరియా...కేంద్ర మంత్రి గడ్కరి వినూత్న ఐడియా

Nitin Gadkari says Store nation's urine : ఇదే సమావేశంలో గడ్కరీ మరో ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని.. దాన్ని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చునని అన్నారు. తద్వారా పంట రాబడి మరో 25శాతం పెరుగుతుందన్నారు.

news18-telugu
Updated: March 4, 2019, 5:30 PM IST
మూత్రంతో యూరియా...కేంద్ర మంత్రి గడ్కరి వినూత్న ఐడియా
నితిన్ గడ్కరీ(File)
news18-telugu
Updated: March 4, 2019, 5:30 PM IST
అన్‌బాక్స్ చేయని తన ఐడియాల్లో నుంచి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. మన దేశం మూత్రాన్ని దాచిపెట్టుకోగలిగితే.. విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. మానవ మూత్రం జీవ ఇంధనంగా ఉపయోగపడుతుందని.. అందులో సల్ఫేట్, నైట్రోజన్ ఉంటాయని గడ్కరీ అన్నారు. కొత్త ఆవిష్కరణల ప్రాధాన్యం గురించి చెబుతూ.. మానవ వ్యర్థాల నుంచి జీవ ఇంధనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో చెప్పడానికి దీన్నో ఉదాహరణగా చెప్పారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన యువ సృజనాత్మక ఆవిష్కరణలు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ ఈ ప్రతిపాదన చేశారు.

విమానాశ్రయాల్లో మూత్రాన్ని స్టోర్ చేయాల్సిందిగా ఇదివరకు నేను కోరాను. ప్రస్తుతం మనం విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి దేశం మొత్తం మూత్రాన్ని స్టోర్ చేయడం మొదలుపెడితే యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. మూత్రం ఒక శక్తివంతమైన ద్రవం, ఏదీ వృథాగా పోదు.-
నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి


ఇదే సమావేశంలో గడ్కరీ మరో ఉదాహరణ కూడా చెప్పారు. మనిషి వెంట్రుకల నుంచి అమినో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయని.. దాన్ని కూడా ఎరువుగా ఉపయోగించుకోవచ్చునని అన్నారు. తద్వారా పంట రాబడి మరో 25శాతం పెరుగుతుందన్నారు. అమినో యాసిడ్స్ మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, 180కంటైనర్ల జీవ ఎరువుల(బయో ఫెర్టిలైజర్స్)ను దుబాయ్ మన నుంచి కొనుగోలు చేస్తుందని తెలిపారు.
First published: March 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...