బీజేపీకి జేడీయు షాక్...ఆ విషయంలో మమత సర్కారుకు బాసట

బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీకి మద్దతుగా జేడీయు అధికార ప్రతినిధి వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: June 12, 2019, 5:20 PM IST
బీజేపీకి జేడీయు షాక్...ఆ విషయంలో మమత సర్కారుకు బాసట
బీహార్ సీఎం నితీశ్ కుమార్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 12, 2019, 5:20 PM IST
ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన జేడీయు...బీజేపీకి దూరం జరుగుతోందన్న ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.  బీజేపీని నిత్యం ఏకిపారేస్తున్న తృణాముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని వెనకేసుకొస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంలో మమత సర్కారు విఫలం చెందిందన్న విమర్శలు సరికావని జేడీయు అధికార ప్రతినిధి అజయ్ అలోక్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మమత సర్కారును నిందించడం మానుకోవాలని...కేంద్రం ఏం చేయగలుగుతుందో చేయాలని ఆయన సూచించారు. అమిత్ షా హోం మంత్రిగా ఉన్నారని గుర్తుచేస్తూ...బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

కేంద్ర కేబినెట్‌లో తమ పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల ఆ పార్టీ అసంతృప్తితో ఉంది. కేంద్ర కేబినెట్‌లో చేరకూడదని నిర్ణయించుకున్న జేడీయు...ఎన్డీయే కూటమిలో మాత్రం భాగస్వామిగా కొనసాగుతామని స్పష్టంచేసింది. జేడీయు-బీజేపీ మధ్య నెలకొన్న లుకలుకలు ఎక్కడికి దారితీస్తాయోనన్న చర్చ కొనసాగుతోంది. బీహార్‌లో బీజేపీతో అధికారాన్ని పంచుకుంటున్న జేడీయు...వెంటనే బీజేపీతో తెగతెంపులు చేసుకుని మహాకూటమిలో చేరాలంటూ ఇప్పటికే రాబ్రీ దేవి సహా పలువురు ఆర్జేడీ నేతలు బహిరంగ ఆహ్వానాలు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీకి మద్దతుగా జేడీయు అధికార ప్రతినిధి వ్యాఖ్యలు చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...