ఇప్పటికీ అదే భావజాలం.. : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఆసక్తికర కామెంట్స్

తాను లక్కీ చీఫ్ మినిస్టర్ అని అభిప్రాయపడ్డ ఉద్దవ్.. ఒకప్పుడు తనను వ్యతిరేకించినవాళ్లు ఇప్పుడు తనతో ఉన్నారని.. తానెవరితో అయితే ఉన్నానో ఇప్పుడు వాళ్లు తనకు ప్రత్యర్థులుగా మారారని చెప్పారు.

news18-telugu
Updated: December 1, 2019, 6:02 PM IST
ఇప్పటికీ అదే భావజాలం.. : మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఆసక్తికర కామెంట్స్
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే
  • Share this:
ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్దవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్,ఎన్సీపీలతో చేతులు కలిపినప్పటికీ తమ పార్టీ భావజాలంలో మాత్రం మార్పు ఉండదన్నారు.అలాగే మాజీ సీఎం ఫడ్నవీస్‌ తనకెప్పుడూ మిత్రుడేనని స్పష్టం చేశారు. 'నేనిప్పటికీ హిందుత్వ భావజాలానికే కట్టుబడి ఉన్నాను. ఎప్పటికీ ఆ భావజాలాన్ని విడిచిపెట్టేది లేదు. గడిచిన ఐదేళ్లలో శివసేన ప్రభుత్వానికి వెన్నుపోటు పొడవలేదు.' అని తెలిపారు.

తాను లక్కీ చీఫ్ మినిస్టర్ అని అభిప్రాయపడ్డ ఉద్దవ్.. ఒకప్పుడు తనను వ్యతిరేకించినవాళ్లు ఇప్పుడు తనతో ఉన్నారని.. తానెవరితో అయితే ఉన్నానో ఇప్పుడు వాళ్లు తనకు ప్రత్యర్థులుగా మారారని చెప్పారు. అదృష్టం,ప్రజల ఆశీస్సులు అన్నీ కలిసి తాను ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. ఈ పదవి చేపడుతానని గతంలో ఎప్పుడూ ఎక్కడా ఎవరితోనూ తాను చర్చించలేదని చెప్పారు. తాను ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తానని.. అర్ధరాత్రి రాజకీయాలు చేయనని చెప్పారు.
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading