STAY OUT OF TRS LEADERS VISIT IN AP CHANDRABABU WARNING TO TDP LEADERS AK
బంధుత్వాలు బయట చూసుకోండి... ఏపీ టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
చంద్రబాబు (ఫైల్ ఫొటో)
మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్లు రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా ? అంటూ తలసాని తీరును చంద్రబాబు తప్పుబట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్కు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు బంధువులు కావడంతో... వారిని ఉద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ నేతలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యర్ధి పార్టీల్లోని నాయకులతో బంధుత్వాలు ఉంటే... వాటిని బయటే చూసుకోవాలని సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం ఏపీలోని విజయవాడ, తిరుపతి పర్యటనకు వచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలను తప్పుబట్టిన చంద్రబాబు... ఈ సందర్భంగా ఆయనకు సన్నిహితంగా వ్యవహరించిన పలువురు నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్(ఫైల్ ఫోటో)
మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్లు రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా ? అంటూ తలసాని తీరును చంద్రబాబు తప్పుబట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్కు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు బంధువులు కావడంతో... వారిని ఉద్దేశించి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యల నేపథ్యంలో... ఇకపై టీఆర్ఎస్ నేతల ఏపీ పర్యటనలో టీడీపీ నేతలెవరూ పాల్గొనవద్దని టీడీపీ నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు.
ఈ విషయంలో ఎవరు హద్దు దాటినా... చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీతో టీఆర్ఎస్ స్నేహం చేయడం ఖాయం కావడంతో... ఇకపై టీఆర్ఎస్ నేతలు ఏపీలో పర్యటించి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారనే అంచనాకు వచ్చిన టీడీపీ నాయకత్వం... ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏపీలో టీఆర్ఎస్ను కట్టడి చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారని అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.