Home /News /politics /

STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR ISSUES SHOW CAUSE NOTICE TO MINISTER KODALI NANI OVER HARSH COMMENTS HERE ARE THE DETAILS PRN

SEC vs Kodali Nani: కొడాలి నానికి నిమ్మగడ్డ షాక్.. ప్రెస్ మీట్ పెట్టిన గంటలోనే నోటీసులు

నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)

నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నాని(ఫైల్ ఫొటో)

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయం మరోసారి వేడెక్కింది. మరో మంత్రిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh Kuamari) ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మరోసారి వేడెక్కింది. మరో మంత్రిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నోటీసులు కూడా జారీ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్ కు నోటీసులిచ్చి మీడియాతో మాట్లాడవద్దంటూ ఆదేశాలిచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని వ్యాఖ్యలను పరిశీలించామని.. ఆ వ్యాఖ్యలు ఎస్ఈసీని కించపరిచేవిగా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సాయంత్రం 5గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వ్యక్తిగతంగా గాని, సహాయకుల చేతగాని వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగ ప్రకటన కూడా చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

    కొడాలి ఏమన్నారంటే...
    తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని.. రాష్ట్రంలో రేషన్ సరుకుల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఎస్ఈసీ, చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని ఎస్ఈసీ నిమ్మగడ్డ, చంద్రబాబు కలిసి వచ్చినా అడ్డుకోలేరన్నారు. వీరంతా జగన్నాథరథ చక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పిచ్చి పెట్టిందని.. వారిని పరీక్షించి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చెర్పించి ట్రీట్ మెంట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.

    Minister Kodali Nani, Kodali Nani, Kodali Nani Latest comments, Kodali Nani Slams Chandra Babu, Kodali Nani on Ration Door Delivery, Kodali nani on Lokesh, AP Panchayat Elections, Andhra Pradesh Panchayat Elections, Panchayat Elections, AP Local Body Elections, Grama Panchayat Elections, AP News, Telugu News, AP politicsNara Chandrababu Naidu, Nara Lokesh, Telugu Desham Party, YSR Congress, YSRCP, Ramnath Kovind, Amit Shah, మంత్రి కొడాలి నాని, కొడాలి నాని, కొడాలి నాని వ్యాఖ్యలు, చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్, కొడాలి నాని న్యూస్, రేషన్ డోర్ డెలివరీ, కొడాలి నాని విమర్శలు, లోకేష్ పై కొడాలి నాని వ్యాఖ్యలు, ఏపీ పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు, ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, ఏపీ రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్,Andhra Pradesh, AndhraPradesh, Kodali nani News, Nimmagadda Ramesh Kumar, Nimmagadda Ramesh kumar notice to Kodali nani, SEC Notice to Kodali Nani, నిమ్మగడ్డ రమేష్ కుమార్, కొడాలి నానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటీసులు, కొడాలి నానికి ఎస్ఈసీ నోటీసులు
    మంత్రి కొడాలి నానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు

    ఇది చదవండి: కొడాలి నాని నోట పుతిన్, బైడెన్ మాట.. లోకేష్ గెలిస్తే రాష్ట్రం వదిలిపోతానన్న మంత్రి



    వివరణ ఇస్తారా..?
    మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడిన గంటలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఐతే దీనిపై కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహనిర్బంధం చేయాలని ఆదేశించగా.. హైకోర్టు వాటిని కొట్టేసింది. మీడియాతో మాట్లాడొద్దని మాత్రం తేల్చింది. జోగి రమేష్ చేసిన కామెంట్స్ పై సీరియస్ అయిన ఎస్ఈసీ మీడియాతో మాట్లాడటం గానీ, బహిరంగసభల్లో పాల్గొవడం గానీ చేయవద్దంది. దీనిపై ఆయన హైకోర్టుకెళ్లే ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇది చదవండి: ఏపీలో మరోసారి ఎన్నికల నగారా.. ఎస్ఈసీ ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ



    ఇదిలా ఉంటే ఇప్పుడు కొడాలి నాని స్పందనపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మీడియాతో మాట్లాడిన వెంటనే తన సొంత నియోజకవర్గానికి వెళ్లిపోయిన నాని.. ఎస్ఈసీ ఇచ్చిన డెడ్ లైన్ లోపు స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ నాని స్పందించకపోతే ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, Gram Panchayat Elections, Kodali Nani, Local body elections, Nimmagadda Ramesh Kumar, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు