STATE ELECTION COMMISSIONER NIMMAGADDA RAMESH KUMAR ISSUES KEY ORDERS TO ELECTIONS OFFICERS ON WITHDRAWAL OF NOMINATIONS IN MUNICIPAL ELECTIONS HERE ARE THE DETAILS PRN
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికలపై నిమ్మగడ్డ సంచలన ఆదేశాలు... ఏకగ్రీవాలే టార్గెట్...
మున్సిపల్ ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికలపై (AP Municipal Elections) ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (SEC Nimmagadda Ramesh Kumar) సంచలన ఆదేశాలిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన ఆదేశాలిచ్చారు. ఏకగ్రీవాలపై దృష్టి పెట్టిన ఎన్నికల కమిషనర్... ఫిర్యాదులపై విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్ విత్ డ్రా చేయించారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నామినేషన్ వేసిన తర్వాత పరీశీలనలో ఆమోదం పొందిన తర్వాత ఎవరైనా బలవంతంగా విత్ డ్రా అయితే వారు మరోసారి ఆర్వోకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కన్నారు. అలాంటి దరఖాస్తులేమైనా వస్తే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన తేదీ అయిన మార్చి 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు ఇలాంటి దరఖాస్తుల వివరాలను తనకు పంపాలని స్పష్టం చేసింది.
మరోవైపు త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు నిమ్మగడ్డ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ ఎన్నికలను కూడా గతంలో నిలిపేసిన దశ నుంచి కొనసాగించాలా లేక కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలా అనే అంశంపై ఎస్ఈసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చలు జరుపుతోంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు సమాచారం.
గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా.. చాలా మండలాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదింరిచి ఏకగ్రీవాలు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ తు ఫిర్యాదులు కూడా అందాయి. అప్పట్లో ఎన్నికలు వాయిదా పడటంతో ఏకగ్రీవాలు, ఫిర్యాదుల అంశానికి బ్రేక్ పడింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉండటంతో ఏకగ్రీవాలు, ప్రతిపక్షాల ఫిర్యాదులపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితులు ఎదరుయ్యాయా అనే అంశంపై నిమ్మగడ్డ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.