కేసీఆర్..రాయలసీమ ప్రజల గొంతు కోయొద్దు ... విష్ణువర్ధన్ రెడ్డి

గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడింది.

news18-telugu
Updated: May 12, 2020, 1:42 PM IST
కేసీఆర్..రాయలసీమ ప్రజల గొంతు కోయొద్దు ... విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
కదిరి-అనంతపురం: సముద్రంలో కలిసిపోయె నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కేసీఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం అని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు కాకుండా కుట్రచేస్తున్నారు అని అన్నారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడింది. రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సందే అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలని సూచించారు.
ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తిని చేస్తున్నాను అన్నారు.

కేసీఆర్ గారు మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారు. రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసీఆర్ అలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ గారికి (అనంతపురం జిల్లా ఇన్చార్జి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని అడుగుతున్నా అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
Published by: Venu Gopal
First published: May 12, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading