కరుణానిధి మరణానికి స్టాలినే కారణం... పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు

తమిళనాడు సీఎం పళనిస్వామి(ఫైల్ ఫోటో)

అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని విదేశాల్లో వైద్యం చేయించే అవకాశం ఉన్నా, పట్టించుకోకుండా వదిలేసి తండ్రి మరణానికి స్టాలిన్ పరోక్షంగా కారణమయ్యాడని పళనిస్వామి విమర్శించారు.

  • Share this:
    ఎన్నికల వేళ తమిళనాడులో నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. తాజాగా సీఎం పళనిస్వామి ప్రతిపక్ష నేత స్టాలిన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి కరుణానిధిని స్టాలిన్ రెండు సంవత్సరాల పాటు హౌజ్ అరెస్టు చేసినట్లు ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధిని విదేశాల్లో వైద్యం చేయించే అవకాశం ఉన్నా, పట్టించుకోకుండా వదిలేసి తండ్రి మరణానికి స్టాలిన్ పరోక్షంగా కారణమయ్యాడని పళనిస్వామి విమర్శించారు. కరుణానిధి బతికి ఉన్నంత కాలం డీఎంకే పార్టీకి స్టాలిన్ అధ్యక్షుడు కాలేరని, అందుకే కుటిల నీతితో తండ్రిని పొట్టన బెట్టుకున్నాడని విమర్శించారు.

    ఇదిలా ఉంటే తమిళనాడులో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి ఒక ప్రత్యేకత ఉంది. అటు అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూసిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఇద్దరూ వారి వారి పార్టీలకు అంతా తామే అయి నడిపారు. గడిచిన 3 దశాబ్దాల రాజకీయాలను గమనిస్తే, ఎన్నికలు మొత్తం ఈ ఇద్దరు నేతల కేంద్రంగానే నడిచాయి. ఈ సారి మాత్రం అటు అన్నాడీఎంకే పార్టీకి జయలలిత లేకపోవడం పెద్ద లోటే అని చెప్పవచ్చు. జయ వారసత్వం కోసం చెలరేగిన పోరు పార్టీని నిలువునా చీలింది. అదే సమయంలో డీఎంకేలో సైతం కరుణానిధి వారసత్వం కోసం పోరాటం సాగినప్పటికీ స్టాలిన్ చాకచక్యంగా వ్యవహరించి, పార్టీపై పట్టు సాధించారు.
    First published: