• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SRINIVAS GOUD REACTION ON SWAMY GOUD AS SPECULATIONS ON OVER HIS MEETING WITH BJP LEADERS SK

Swamy Goud: బీజేపీలోకి స్వామిగౌడ్..? మంత్రి శ్రీనివాస్ గౌడ్ రియాక్షన్ ఇదే..

Swamy Goud: బీజేపీలోకి స్వామిగౌడ్..? మంత్రి శ్రీనివాస్ గౌడ్ రియాక్షన్ ఇదే..

స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్

శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

  • Share this:
    జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో స్వామిగౌడ్‌తో బీజేపీ నేతలు సమావేశమవడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. టీఆర్ఎస్‌కు షాక్ తప్పదా? గులాబీ దండుపై గుర్రుగా ఉన్న స్వామిగౌడ్.. సీఎం కేసీఆర్‌కు షాక్ ఇచ్చి.. బీజేపీ గూటికి చేరతారా? చాలా మంది అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో స్వామి గౌడ్ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఆయన బీజేపీలోకి వెళతారని తాను అనుకోవడం లేదని.. బీజేపీ నేతలే ఆయన ఇంటికి వెళ్లి చర్చించారి తెలిపారు. టీఆర్ఎస్ నేతలెవరూ బీజేపీలోకి వెళ్లరని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలుంటే.. పరిష్కరించుకుంటామని చెప్పుకొచ్చారు.

    శనివారం సాయంత్రం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

    ఐతే బీజేపీలోకి వెళ్తున్నారన్న ప్రచారంపై స్వామిగౌడ్ స్పష్టత ఇవ్వలేదు. టీఆర్ఎస్‌లోనే ఉంటానని గానీ.. బీజేపీలోకి వెళ్తున్నానని గానీ చెప్పలేదు. ఇది స్నేహపూర్తక కలయిక అని.. మిత్రులతో కూడా మాట్లాడవద్దా.. అని మీడియాను ఎదురు ప్రశ్నించారు స్వామిగౌడ్. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తెలియజేస్తానని వెల్లడించారు. అటు లక్ష్మణ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది స్నేహపూర్వక భేటీ మాత్రమేనని..రాజకీయాలు కూడా చర్చించామని చెప్పారు. ఒకవేళ స్వామిగౌడ్ బీజేపీలో చేరితే మీడియాకు చెబుతామని తెలిపారు లక్ష్మణ్. కాగా, కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీపట్ల స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

    గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో చేరారు. టీఆర్ఎస్‌ నుంచి టికెట్ రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, వెంగళరావునగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు. మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో పాటు పలువురు నగర నాయకులు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా త్వరలోనే బీజేపీ తీర్థంపుచ్చుకోబోతున్నట్లు వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: