కులాల మధ్య మాట్లాడుతూ... సీఎం జగన్‌ను లేపేస్తారా?: శ్రీకాంత్ రెడ్డి

‘ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో సామాజిక దూరం పాటించాలి, కానీ సామాజిక కులాలను విడదీసే భయంకరమైన వ్యాధిని తెస్తున్నారు.’ అని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

news18-telugu
Updated: April 16, 2020, 4:40 PM IST
కులాల మధ్య మాట్లాడుతూ... సీఎం జగన్‌ను లేపేస్తారా?: శ్రీకాంత్ రెడ్డి
చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి..
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కులం జోలికి వస్తే లేపేస్తామంటున్నాడు ఓ మాజీ ఎంపీ. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో సామాజిక దూరం పాటించాలి, కానీ సామాజిక కులాలను విడదీసే భయంకరమైన వ్యాధిని తెస్తున్నారు. కులాల మధ్య మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్‌ను లేపేస్తారా?’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యాక్షనిస్టు రాజ్యమని లేఖలో వ్రాయడంఏంటని, ఇవేం కుల రాజకీయాలని ప్రశ్నించారు. రాజధానుల వికేంద్రీకరణ విషయంలో వ్యతిరేకించారని, కియాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులమతాలు తమకు అవసరం లేదన్న శ్రీకాంత్ రెడ్డి.... దేశంలోనే వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్ లు కల్పించిన ఏకైక నాయకుడు జగన్ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

ప్రజల సంక్షేమం కోసం జగన్ ఎప్పుడూ రెండడుగులు ముందే ఉంటారన్నారు. క్వారంటైన్ నుంచి ఎవరైనా డిశ్చార్జ్ అయినప్పుడు రూ.2 వేలు చెల్లించడం అభినందనీయమన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఇష్టం లేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో తల్లిదండ్రుల కమిటీలు 99% ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతిస్తున్నాయని చెప్పారు. యస్.సి., యస్.టి, బి.సి, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత కల్పించటం, వారి బతుకులు బాగు చేయడం చంద్రబాబుకు ఇష్టం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. జపాన్ అభివృద్ధి చెందింది, జపాన్ భాష నేర్చుకో అనే చంద్రబాబు... ఇంగ్లీషును మాత్రం అడ్డుకుంటారని విమర్శించారు.

First published: April 16, 2020, 3:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading