హుజూర్‌ నగర్ బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి !

Huzurnagar bypoll 2019 | హుజూర్ నగర్ బరిలో బీజేపీ తరపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై బీజేపీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, 2008 ఎన్నికల్లో పోటీ చేసిన భాగ్యారెడ్డితో పాటు శ్రీకళారెడ్డి పేర్లు చర్చకు వచ్చాయని సమాచారం.

news18-telugu
Updated: September 24, 2019, 2:24 PM IST
హుజూర్‌ నగర్ బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి !
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హుజూర్ నగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి ఎంపిక దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై సమావేశమైన రాష్ట్ర కోర్ కమిటీ... ఈ అంశంపై దాదాపు గంటన్నరకు పైగా చర్చించింది. హుజూర్ నగర్ బరిలో పార్టీ తరపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై బీజేపీ సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, 2008 ఎన్నికల్లో పోటీ చేసిన భాగ్యారెడ్డితో పాటు శ్రీకళారెడ్డి పేర్లు చర్చకు వచ్చాయని సమాచారం. అయితే వీరిలో ఎక్కువమంది నేతలు శ్రీకళారెడ్డి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరిన శ్రీకళారెడ్డి మాజీ ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి కూతురు. ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఎంపీ గరికపాటి మోహన్ రావు పార్టీ అధినాయకత్వానికి సూచించారు.

దీంతో బీజేపీ నాయకత్వం శ్రీకళారెడ్డి అభ్యర్థిత్వంపై మొగ్గుచూపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ తమ పార్టీ తరపున హుజూర్ నగర్ బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ప్రచారం కూడా మొదలుపెట్టడంతో...బీజేపీ సైతం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ తరపున టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతి బరిలో నిలుస్తుండగా...అధికార టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి పోటీ చేయనున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కోసం ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

First published: September 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading