టాలీవుడ్ కాంట్రోవర్సీ పర్సన్ శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఈసారి సినీ ప్రముఖులను కాకుండా.. ఆమె రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేసింది. ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఓ లీడర్‌పై శ్రీరెడ్డి మనసు పారేసుకుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై తన ప్రేమను వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒక్కరోజు భార్యగా ఉన్నా చాలని, ఆ తరువాత చనిపోయినా ఫర్వాలేదంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో శ్రీరెడ్డి చేసిన ఓ పోస్ట్.. ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
శ్రీరెడ్డి తాజా పోస్టు వైసీపీ సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం నాయకులు పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తమ నాయకుడిపై ప్రేమను వ్యక్తం చేయడాన్ని పలువురు నాయకులు స్వాగతిస్తుండగా.. మరి కొందరు ఆయనను వదిలేయ్ తల్లో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బైరెడ్డికి రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించొద్దని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను ట్రై చేసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.అంతేకాదు కొందరు శ్రీరెడ్డి ఈ కామెంట్స్ చేయగానే... అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరంటూ గూగుల్‌లో వెతికేస్తున్నారు. మొత్తం మీద వైసీపీ యువనేతపై శ్రీరెడ్డి చేసిన తాజా కామెంట్స్ మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.