ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నటి శ్రీరెడ్డి నాలుగు సలహాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి నాలుగు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరా మీద దృష్టి పెట్టాలని సూచించారు. అందుకోసం అవసరమైతే అంబానీల సాయం తీసుకోవాలని కోరారు. ‘మన శత్రువులు ఎవరో నాకు తెలుసు. కానీ నువ్వు ఒక్కడివే కాదు. జగన్ అంటే జగం, జనం’ అని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
దీంతోపాటు రాష్ట్రంలో గ్రీన్ సిటీస్ అభివృద్ధి చేయాలని సూచించారు. దీని వల్ల టూరిజం పెరుగుతుందని, కంపెనీలు కూడా వస్తాయని చెప్పారు.
పారిశ్రామికాభివృద్ధి, రైతుల అభివృద్ధి రాష్ట్ర రెవిన్యూకు వెన్నెముకలాంటివని శ్రీరెడ్డి తెలిపారు.
వీలైనంత త్వరగా రాష్ట్రంలో పెట్టుబడిదారులను అట్రాక్ట్ చేయాలని, యువ సీఎంగా దానిపై ఫోకస్ చేయాలని సూచించారు. అలా చేస్తే, మెజారిటీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
ఆశ్రమంలో పవన్ కళ్యాణ్.. ఆకుల్లో భోజనం
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.