యాంకర్ అవతారం ఎత్తిన శ్రీరెడ్డి... కత్తి మహేష్‌తో..

ఎనిమిది నెలల క్రితం తన యూట్యూబ్ ఛానల్‌‌లో ఇంటర్వ్యూలు ఆపేసింది. ఇప్పుడు కొత్తగా మళ్లీ తన యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూలు చేస్తోంది.

news18-telugu
Updated: November 17, 2019, 10:50 PM IST
యాంకర్ అవతారం ఎత్తిన శ్రీరెడ్డి... కత్తి మహేష్‌తో..
కత్తి మహేష్, శ్రీరెడ్డి
  • Share this:
వివాదాస్పద, సంచలన విషయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి మరోసారి కొత్తగా ముందుకొచ్చారు. ఎప్పుడో ఎనిమిది నెలల క్రితం వదిలేసిన పని మళ్లీ మొదలు పెట్టింది. తన యూట్యూబ్ ఛానల్‌ను మళ్లీ యాక్టివ్ చేసింది. ఎనిమిది నెలల క్రితం తన యూట్యూబ్ ఛానల్‌‌లో ఇంటర్వ్యూలు ఆపేసింది. ఇప్పుడు కొత్తగా మళ్లీ తన యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూలు చేస్తోంది. శ్రీరెడ్డి అఫీషియల్ పేరుతో సెలబ్రిటీలతో స్పెషల్ ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టింది. తన మొదటి ఇంటర్వ్యూగా కత్తి మహేష్‌తో ఇంటర్వ్యూ చేసింది. అందులో అన్నీ బోల్డ్ ప్రశ్నలు వేసింది. కత్తి మహేష్ ఎప్పుడు తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నాడు? ఎంతమందిని ప్రేమించాడు? సన్నీలియోన్ మీద అతడి అభిప్రాయం ఏంటి? తెలుగు హీరోయిన్లలో అతడికి ఎవరి మీద క్రష్ ఉంది?, బాగా నచ్చిన హీరో ఎవరు?, బాగా నచ్చే దర్శకుడు ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది. అందులో కత్తి మహేష్ కూడా కొన్ని ఇంటస్ట్రింగ్ విషయాలను కూడా పంచుకున్నాడు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>