Home /News /politics /

SRI LANKAN FINANCE MINISTER BASIL RAJAPAKSA THANKS PRIME MINISTER MODI FOR INDIA FINANCIAL SUPPORT SNR

Delhi:భారత్‌ నుంచి ఆర్ధిక మద్దతు కోరుతున్న శ్రీలంక..ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాల మధ్య చర్చ

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Delhi: భారత్, శ్రీలంక మధ్య బంధం మరింత బలపడాలని ఇరుదేశాలు కోరుకుంటున్నాయి. భారత్‌ శ్రీలంకకు ఇస్తున్న ఆర్ధిక మద్దతుపై హర్షం వ్యక్తం చేశారు ఆ దేశ ఆర్ధికశాఖ మంత్రి రాజపక్సా. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించారు. భారత్‌, శ్రీలంకలోని మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలనే అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
పొరుగు దేశాలకు పరస్పర సహకారం అందించే విషయంలో భారత్‌ ఎప్పుడూ ముందుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈవిషయంలో శ్రీలంకకు సంపూర్ణ సహకారం అందిస్తామని వారికి అండగా ఉంటుందని శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే(Basil Rajapaksa)కు తెలియజేశారు. శ్రీలంక తన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి భారతదేశం నుండి( USD 1) బిలియన్ క్రెడిట్ లైన్ (LOC)ని ఆశిస్తోంది. దీంతో పాటు అదనపు ఆర్థిక సహాయం ఇచ్చే విషయంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోందని ప్రభుత్వ సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఇరు దేశాలు ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాలు చేపడుతున్న కార్యక్రమాలను శ్రీలంక మంత్రి రాజపక్సే మోదీ(Modi )కి ఫోన్‌ ద్వారా వివరించినట్లుగా సమాచారం. అంతే కాదు శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు లంక ఆర్ధికశాఖ మంత్రి. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకోని మత్స్యకారుల సమస్యపై కూడా మోడీ, బాసిల్‌ రాజపక్సే విస్తృతంగా చర్చించినట్లుగా శ్రీలంక హైకమిషన్ తెలిపింది. లంక, భారత్‌ మత్య్సకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలనే విషయంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మత్స్యకారుల మానవత్వం, జీవనోపాధి, అమలు, సముద్ర జీవావరణ శాస్త్రం, అరెస్టయిన మత్స్యకారులతో పాటు వారి పడవలను ముందస్తుగా విడుదల చేయడం వంటి సంక్లిష్టమైన అనేక అంశాలను గుర్తించారు. వాటన్నింటికి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనవలసిన అత్యవసర అవసరాన్ని కూడా ఇద్దరు ప్రముఖులు అంగీకరించినట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది.

పరస్పర సహకారం..
భారత జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచుగా దాడులు చేస్తూనే ఉంది. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న సమయంలో ఇలాంటి పరిణామాలు సరికాదని..ఇవి భవిష్యత్తులో తలెత్తకుండా చూడాల్సిన అవసరం ఏంతైనా ఉందనే అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీలంక ఆక్రమిత ఆలోచన విధానంపైనే సుధీర్ఘంగా చర్చించారు. శ్రీలంక ప్రజలతో స్నేహపూర్వక భావన కొనసాగించాలన్నదే భారత్ లక్ష్యం అని ప్రధాని మోదీ చెప్పినట్లుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది.

లంకకు భారత్ కొండంత అండ..
విదేశీ మారకద్రవ్యం, ఇంధన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ శ్రీలంకకు గత నెలలో USD 500 మిలియన్ల రుణాన్ని అందించింది. ఫలితంగా శ్రీలంక ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం కావడంతో పాటు భారతదేశం నుండి పెట్టుబడులు పెరగడం చూసి సంతోషిస్తున్నామని ప్రధాని మోదీ శ్రీలంక ఆర్థిక మంత్రి బాసిల్‌ రాజపక్సేకు ట్వీట్‌ చేశారు. ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకంతో పాటు మత్స్య రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక విషయాలపై మోడీ రాజపక్సే చర్చించారని పేర్కొంది. "శ్రీలంకలో పునరుత్పాదక ఇంధనం అభివృద్ధిలో సహకారం పరస్పరం లాభదాయకమని ఇకపై కూడా ఇదే శక్తితో కొనసాగించాలని ఇద్దరు ప్రముఖులు కూడా అంగీకరించినట్లుగా హైకమిషన్ తెలిపింది.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ..
బౌద్ధ , రామాయణ టూరిజం సర్క్యూట్‌ల ఉమ్మడి ప్రమోషన్‌తో పాటు పర్యాటక రాకపోకలు మెరుగుపరుచుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లుగా పేర్కొంది. సాయంత్రం విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా బాసిల్ రాజపక్సే కలిశారు. కరోనా తర్వాత పరిణామాలపై ద్వైపాక్షిక, ఆర్థిక, వాణిజ్య సహకారంతో పాటు అవకాశాల గురించి చర్చించారు. భారత్‌తో ఇచ్చిపుచ్చుకునే విధానానికి శ్రీలంక అంతర్భాగమైనది. భారతదేశం ఎల్లప్పుడూ శ్రీలంకకు నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖఅధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Financial assistance, Narendra modi, Srilanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు