ప్రధాని మోదీ ఇలాఖా వారణాసిలో రాజకీయాలు రంజుగా మారాయి. ఆఖరి క్షణంలో సమాజ్‌వాదీ పార్టీ మోదీపై ఎన్నికల బరిలోకి దింపిన బీఎ్‌సఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు ఈసీ షాకిచ్చింది. ఎలక్షన్ కమిషన్ యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించింది. సరైనపత్రాలు సమర్పించలేదన్న కారణంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించింది. దీనిపై ఈసీ మంగళవారం నాడు నోటీసులు జారీ చేసింది. షాలినీ యాదవ్ స్థానంలో బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కు టికెట్ ఇచ్చి.. ఆ వెంటనే బీఫారం అందజేశారు. వారణాసిలో నామినేషన్ల దాఖలు చివరి రోజు .. హడావిడిగా తేజ్‌బహదూర్‌తో నామినేషన్ వేయించారు. అయితే నామినేషన్ పత్రాల్లో ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ అయినట్లు పేర్కొనలేదు. ఈ లోపాన్ని కనుగొన్న ఈసీ ఆయనకు నోటీసిచ్చి మే 1వ తేదీలోగా (బుధవారంలోగా) సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు సరైన ఆహారం అందడం లేదని, నాణ్యమైన భోజనం దక్కడం లేదని తేజ్ బహదూర్ యాదవ్ ఆరోపించారు. దీంతో ఆయనను ఈ నేరానికి ఆర్మీ డిస్మిస్ చేసింది. తరువాత రాజకీయాల్లో చేరిన తేజ్ బహదూర్‌కు ఎస్పీ టికెట్ ఇచ్చింది. నామినేషన్ వేసిన సమయంలో ఆయన తాను సర్వీసు నుంచి తొలగించినట్లు అంగీకరించారు. కానీ తరువాత సమర్పించిన పత్రాల్లో ఆయన ఆ విషయాన్ని పేర్కొనలేదు. దీంతో బహదూర్ నామినేషన్‌ను ఈసీ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. నిబంధనల ప్రకారం... అవినీతి , దేశద్రోహ ఆరోపణల మీద సర్వీసు నుంచి డిస్మిసైన వారు ఐదేళ్ల పాటు ప్రచారానికి అనర్హులు.
భోజనం బాగులేదని అసత్య ఆరోపణలు చేసి సైన్యం పరువు దిగజార్చడానికి ఆయన ప్రయత్నించినట్లు కోర్టు మార్షల్లో ఆర్మీ నిర్ధారించి ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆయన చేసిన ఆరోపణ దేశద్రోహం కిందకు వస్తుందన్నది ఈసీలో ఓ వర్గం అభిప్రాయం. అయితే నిజం చెప్పినందుకు తనను బలిపశువును చేశారని , దీనిపై తాను సుప్రీంకోర్టులో న్యాయం కోరతాననీ తేజ్ బహదూర్ చెబుతున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.