Home /News /politics /

SPECULATIONS SPREADING THAT JANASENA BJP ALLIANCE MAY END IN ANDHRA PRADESH AND PAWAN KALYAN SERIOUS ON BJP FULL DETAILS HERE PRN

Janasena-BJP: మిత్రుల మధ్య విడాకులకు రంగం సిద్ధమైందా…? తెలంగాణ సీన్ ఏపీలో రిపీట్ కాబోతోందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బీజేపీ (Bharatiya Janatha Party) తో పొత్తువల్లే జనసేన (Janasena) ఘోరంగా ఓడిపోయిందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అధికారం కల్ల అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

    ఆంధ్రప్రదేశ్ లో జనసేన-బీజేపీ మిత్రపక్షాలు. దాదాపు ఏడాదిన్నర క్రితం రెండుపార్టీల మధ్య దోస్తీ కుదిరింది. అప్పటి నుంచి రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాయి. ఐతే క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీలకు లింకు కుదరలేదు. తెలంగాణ బీజేపీపై పవన్ కల్యాణ్ బహిరంగ విమర్శలతో అక్కడ రెండు పార్టీలకు చెడింది. తెలంగాణ బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడా సెగ ఏపీలోనూ తగిలే అవకాశముందంటున్నారు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెగతో విమర్శలెదుర్కొంటున్న జనసేన.. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తువల్ల పెద్దగా సాధించిందేమీ లేదు. దీంతో ఇక్కడ కూడా మిత్రపక్షానికి గుడ్ బై చెప్పేందుకు పవన్ సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనసేన నేతలు కూడా బీజేపీ వైఖరిని తప్పుబడుతున్నారు. కొందరైతే బీజేపీ వల్లే మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయామని విమర్శిస్తున్నారు. దీంతో పొత్తుకు బీటలువారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    క్షేత్రస్థాయిలో సఖ్యత లేదు..
    ఢిల్లీస్థాయిలోని బీజేపీ నేతలతో జనసేనాని పవన్ కల్యాణ్ సఖ్యతతో ఉన్నా.. రాష్ట్రస్థాయిలో మాత్రం అలాంటిది లేదు. మొన్నామధ్య పవన్ కల్యాణ్ ఇదే వ్యాఖ్యలు చేస్తే.. రెండు పార్టీల నేతలు ఒకరి కార్యాలయాలకు మరొకరు క్యూ కట్టారు. పరిచయాలు పెంచుకుంటున్నామని ప్రకటనలు చేశారు. కానీ అదంతా అప్పటికే పరిమితమైంది. తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. పార్టీ గుర్తు లేకుండా సాగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు పార్టీల మద్దతుదారులు ఎక్కడా కలవలేదు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు రాజకీయం నామమాత్రంగానే సాగింది.

    ఇది చదవండి: ఫలితాలపై చంద్రబాబు ముందు ఓపన్ అయిన తమ్ముళ్లు.. తిరుపతిలో వ్యూహం మారుస్తారా..?



    కలిసి నడవని మిత్రులు
    ఇక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రెండుపార్టీలు దూకుడుగా వ్యవహరించింది లేదు. క్షేత్రస్థాయిలో మిత్రుల మధ్య పరస్పర సహకారం కరువైంది. ఫలితం రెండు పార్టీలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగ 25 వార్డుల్లో విజయం సాధించాయి. బీజేపీతో పొత్తువల్లే జనసేన ఘోరంగా ఓడిపోయిందని ఆ పార్టీ నేత పోతిన మహేష్ బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అధికారం కల్ల అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలది ఇదే అభిప్రాయంగా తెలుస్తోంది.

    ఇది చదవండి: వైసీపీకి పెరిగిన ఓటింగ్ శాతం... టీడీపీకి భారీ నష్టం.. జనసేన స్కోర్ ఎంతంటే..!


    చిచ్చుపెట్టిన స్టీల్ ప్లాంట్
    విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి జనసేన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. బీజేపీతో పొత్తు కారణంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమంలో జనసేన పాల్గొనడం లేదు. ఆ ఎఫెక్ట్ విశాఖలో జనసేనపై బాగానే చూపించింది. దీంతో విశాఖలో కేవలం 3 డివిజన్లకే పరిమితమైంది. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో తీవ్ర విమర్శలెదుర్కొంటున్నారు. తాను ఎన్ని చెప్పినా క్షేత్రస్థాయిలో బీజేపీ కలిసిరాకపోవడం, స్టీల్ ప్లాంట్ విషయంలో విజ్ఞప్తులు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీపై పవన్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

    MLA Roja: రోజా వ్యవహారానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెడతారా..? ఫైర్ బ్రాండ్ పై సీనియర్ల వెర్షన్ అదేనా..?



    తిరుపతి విషయంలో బీజేపీ అత్యుత్సాహం
    దీనికి తోడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ నేతల అత్యుత్సాహం.. జనసేన బలంగా ఉన్నా సీటు కేటాయించకపోవడం కూడా పవన్ అసంతృప్తికి కారణమైందన్న వాదన వినిపిస్తోంది. జనసేనను కేవలం సపోర్టింగ్ రోల్ లోనే చూస్తుండటం పవన్ కు నచ్చలేదన్న చర్చ కూడా జరుగుతోంది. త్వరలోనే బీజేపీకి గుడ్ బై చెప్పి ఒంటరిగా లిటిక్స్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి తెలంగాణలో తెగిన బంధం.. ఏపీలో నిలబడుతుందా.. లేదా అనేది వేచి చూడాలి.

    ఇది చదవండి: మేయర్ పదవి కోసం 27 మంది పోటీ... బెజవాడ క్వీన్ ఎవరో..


    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Bjp-janasena, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు