Home /News /politics /

SPECULATIONS OVER YSRCP MLAS CORRUPTION MAY TROUBLE CM YS JAGAN MOHAN REDDY IN 2024 ASSEMBLY ELECTIONS FULL DETAILS HERE PRN GNT

YSRCP: ఎమ్మెల్యేల తీరుతో సీఎం జగన్ కు చిక్కులు తప్పవా..? ఇలా అయితే నవరత్నాలు బూడిదలో పోసిన పన్నీరేనా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మునుపెన్నడూ సాధించని ఘన విజయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సాధించారు.

  అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ సాధించని ఘన విజయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 85శాతం సీట్లను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ముప్పైఎళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా కొనసాగాలని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే తన కోరిక అని బహిరంగంగానే ప్రకటించారు సీఎం జగన్. అందుకు తగ్గట్లే నవరత్నాలు, సంక్షేమ పథకాల పేరుతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నారు. ప్రతి నెల ఒకటో, రెండో సంక్షేమ పథకాలు అమలవుతూనే ఉన్నాయి. రాష్ట్రం అప్పుల పాలవుతోందని ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టినా సరే జగన్ మాత్రం తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నారు. కులం,మతం,పార్టీల తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆ పధకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశిస్తున్నారు.

  అలాగే తమ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా గీతదాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐతే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ హెచ్చరికలు, ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉందట కొందరు ఎమ్మెల్యేల తీరు. వచ్చే ఎన్నికల్లో సీటుకు గ్యారెంటీ లేదని.. ఫ్యూచర్ సంగతి పక్కనబెట్టి ప్రజెంట్ గురించి ఆలోచించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చాలా మంది భావిస్తున్నట్లు టాక్.

  ఇది చదవండి: జగనన్న పచ్చతోరణంకు శ్రీకారం.. స్కూల్ డేస్ గుర్తుకుతెచ్చుకున్న సీఎం


  తెలుగుదేశం పార్టీ హయాంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని కంట్రోల్ చేయకపోవడం వల్లే 2019లో ఆ పార్టీ ఘోరంగా ఓడిందన్న భావన చాలా మందిలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే వైసీపీ అధికారంలోకి వచ్చినవెంటనే అవినీతి విషయంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం జగన్. ఐతే సీఎం ఇచ్చిన వార్నింగ్ ను చాలా మంది పక్కనపెట్టేశారట. అక్రమ మద్యం, పేకాట, ఇసుక, ఇతర వ్యవహారాల్లో తలదూర్చుతూ కోట్లలో వెనకేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇది చదవండి: ఏపీలో వింత.. కోడిపుంజు చేసిన పనికి అంతా షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..!


  మరికొందరైతే స్థానికంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కన్ష్ట్రక్షన్ కంపెనీలు, కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల రూపంలో వసూళ్లు చేస్తున్నారన్న టాక్ లేకపోలేదు. అదేమని ఎవరైనా అడిగితే గతంలో టీడీపీ వాళ్లు చేస్తే నోరు విప్పనివాళ్లు ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఎదురు సమాధానం చెప్తున్నారట. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు గడిచిపోయింది. మంత్రి పదవులు వస్తాయనే ఆశ ఎలాగూ లేదు గత పదేళ్లుగా పార్టీ కోసం తమ ఆస్థులు తాకట్టు పెట్టి మరీ పోరాడామని.. పైగా ఎన్నికలు అంటేనే భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇవన్నీ చూసుకుంటే తమ పదవీకాలం ముగిసేలోగా ఎంతో కొంత వెనకేసుకోవాలిగా అని కొందరు నిట్టూరుస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: ఎమ్మెల్యే రోజాకు రోజాపూలతో అభిషేకం... పూలవానలో తడిసి ముద్దైన జబర్దస్త్ జడ్జ్


  ఏది ఏమైనా తన సొంత పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని కంట్రోల్ చెయ్యలేక పోతే మాత్రం జగన్ కు రాబోవు ఎన్నికలలో ఎదురు దెబ్బ తప్పకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకులు మాట.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు