హోమ్ /వార్తలు /politics /

AP Politics: ముందస్తు ఎన్నికల వ్యూహంలో సీఎం జగన్..? దీనివెనుక అసలు కారణం ఇదేనా..!

AP Politics: ముందస్తు ఎన్నికల వ్యూహంలో సీఎం జగన్..? దీనివెనుక అసలు కారణం ఇదేనా..!

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

చంద్రబాబు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనమే. తరువాత ఏంచేస్తారో అన్నది ముమ్మాటికీ సస్పెన్స్ గా మారుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) వైఖరి.

ఇంకా చదవండి ...

  M.Bala Krishna, Hyderabad, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనమే. తరువాత ఏంచేస్తారో అన్నది ముమ్మాటికీ సస్పెన్స్ గా మారుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) వైఖరి. తాను చేసేది ఏంటో క్యాబినెట్ మీటింగ్ లో సుస్పష్టంగా చెప్పేస్తూ.., మంత్రులతో ముక్కుసూటిగా వెళ్లిపోతుంటారు వైఎస్ జగన్. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట సీఎం జగన్. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తన మనసులో మాట బయట పెట్టారట. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక సీఎం జగన్ పెద్ద వ్యూహమే రచించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు చెక్ పెట్టేందుకు ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నిక సెగ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై బలంగా పడనునట్లు తెలుగు తమ్ములు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చజరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తే.., అన్ని పార్టీలు నియోజకర్గ ఇన్ ఛార్జులను నియమించాలి... పార్టీ కేడర్ ను సన్నద్ధం చేయాలి. ఎన్నికలకు ఎప్పుడు వెళ్లినా వైసీపీకి ఆ సమస్య లేదు. టీడీపీ మాత్రం వెంటనే రంగంలోకి దిగి ఇన్ ఛార్జులను నియమించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీకి ఇన్ ఛార్జులులేరు.

  ఇది చదవండి: సాయితేజ్ రిపబ్లిక్ సినిమాపై వివాదం.., కోర్టుకు వెళ్తామని హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..!


  మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రచారం సాగుతున్న నేపథ్యంలో టీడీపీలో పదే పదే ఓ అంశం ప్రస్తావనకు వస్తోంది. అదే అభ్యర్థుల ఎంపిక. క్షేత్ర స్థాయిలో ఎవరి పరిస్థి ఏంటి అనే అంశాన్ని అధికార పార్టీ ఆచరణలో పెట్టనుంది. కచ్చితంగా 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీట్లను దక్కించుకొని అవకాశం లేదని తెలుగు తమ్ముళ్లలో చర్చ సాగుతోందట. అంతమంది టిక్కెట్లు దక్కించుకోక పోవడం అంటే మాములు విషయం కాదు. ఇదే అంశంపై తెలుగు తమ్ముళ్లలో గుబులు మొదలైంది. వైసీపీ సిట్టింగ్ లకు సీటు రాకపోవడానికి, టీడీపీ నాయకుల ఆందోళనకు పెద్ద కథే ఉంది. వైసీపీలో టిక్కెట్లు దక్కని వారు తమ స్థానాలకు ఎక్కడ ఎసరు పెడతారో అనే ఆందోళన సాగుతోంది.

  ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీపై సంచలన ఆరోపణలు... సీఎం జగన్ కు కార్యకర్త ఫిర్యాదు


  రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలలో సుమారు 45 చోట్ల టీడీపీ పార్టీకి ఇన్ ఛార్జులు కరువైయ్యారు. మరో యాభై స్థానాల్లో టీడీపీ ఇంచార్జ్ లను మార్చి కొత్తవారికి చోటు కల్పించాలనే వాదన వినిపిస్తోంది. సీట్లు దక్కని సీటింగ్ లో పార్టీలోకి వస్తామంటే.. అందుకు టీడీపీ అధినాయకత్వం ఒకే అంటే...?? ఆలా వచ్చే వారికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ కొనసాగుతోంది.

  ఇది చదవండి: జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే..? పవన్ స్ట్రాటజీ ఇదేనా..?


  ఇదే కనుక జరిగితే టీడీపీకి కష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పక్కపార్టీ వారిని చేర్చుకున్నారు. వారికే పదవులు కట్టబెట్టడంతో పార్టీ క్యాడర్ నిరుత్సాహంకు గురైంది. అదే ఫలితం 2019 ఎన్నికల్లో రుజువైంది. అధికారం లేని సమయంలో అదే తప్పు చేస్తే పార్టీ కోలుకోవడం కష్టంగా మారుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే పాత తప్పిదాలు పునరావృతం కాకుండా టీడీపీ అధినాయకత్వం పావులు కదుపుతోందట. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీకే నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, TDP, Ysrcp

  ఉత్తమ కథలు