Janasena Party: త్య‌ర‌లో ప‌వ‌న్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే..? తనయుడి భవిష్యత్ కోసమేనా..?

ప్రతీకాత్మక చిత్రం

రాజకీయాల్లో ముందుచూపు లేకపోతే ఏళ్లతరబడి నిర్మించుకున్న కంచుకోటలు కూలిపోవడం ఖాయం.

 • Share this:
  రాజ‌కీయాల్లో ముందుచూపు చాలా అవ‌స‌రం. అదే లేక‌పోతే అప్ప‌టి వ‌ర‌కు ఎంతో క‌ష్ట‌ప‌డి నిర్మించుకున్న నేత‌ల రాజ‌కీయ కోట‌లు పునాధుల‌తో స‌హా కూలిపోయే ప్ర‌మాదాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో ఒక మాజీ ఎమ్మెల్యే ప‌రిస్థితి అచ్చం ఇలానే ఉంద‌టా. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అప్పుడు ప్ర‌భుత్వం టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కి చిక్కి తీరా ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఎటూ కాకుండా పోయార‌నే టాక్ సొంత జిల్లాలోనే విపిస్తుండ‌డం ఇప్పుడు ఆ స‌ద‌రు నేత‌కు మింగుడు ప‌డ‌డం లేద‌నే టాక్ విపిస్తోంది. ఇక అస‌లు విష‌యానికొస్తే... జోత్యుల నెహ్రూ ఈయ‌న గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 1999 లో జ‌గ్గంపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయ‌న త‌రువాత ప‌లుమార్లు పార్టీ కండువాలు మార్చారు. చిరంజీవి పార్టీ పెట్టిన‌ప్పుడు తొలిత ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీను వీడి ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో ఆ పార్టీ తరపున నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

  అయితే అప్పుడు పార్టీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో అప్ప‌టి అధికార‌పార్టీ అయిన టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు చిక్కి అప్ప‌టి నుంచి ఆ పార్టీలోనే కొన‌సాగుతున్నారాయన. అయితే 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం త‌రువాత ఆయ‌న రాజకీయ భ‌విష్య‌త్ డైలామాలో ప‌డింద‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు. దీనికి తోడు ఈ మ‌ధ్య సొంత‌పార్టీలోని నేత‌ల‌తోనే ఆయ‌న‌కు విభేధాలు వ‌స్తున్నాయ‌నే వాదన‌లు వినిపిస్తోన్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు పరిష‌త్ ఎన్నిక‌ల త‌మ‌పార్టీ దూరంగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన త‌రువాత ఆయ‌న నిర్ణ‌యాన్ని విభేదిస్తూ పార్టీ ఉపఅధ్యక్షుడ ప‌ధ‌వికి రాజీనామా చేశారు జోత్యుల. అయితే అప్ప‌టినుంచి పార్టీలో ఉండీ లేన‌ట్లుంది ఆయ‌న తీరు.

  ఇది చదవండి: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. సీఎం జగన్ కీలక నిర్ణయం


  ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు న‌విన్ ను కాకినాడ పార్ల‌మెంట్ స్థానం నుంచి బ‌రిలో దించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న ఈ నేత అందుకు త‌గ్గ‌ట్లుగానే పావులు క‌దుపుతున్న‌ట్లు చెబుతున్నారు ఆయ‌న స‌న్నిహితులు. వచ్చే ఎన్నిక‌ల్లో త‌మ కుమారుడికి ఎంపీ సీట్ బాబు ఇస్తాన‌ని హామీ ఇచ్చిన‌ప్ప‌టికి ఆ పార్టీలో ఉంటే భవిష్య‌త్ ఉండ‌ద‌నే ఆలోచ‌న‌లో జ్యోతుల ఉన్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే ప్ర‌స్తుతం త‌న‌కు పార్టీ మార‌డానికి ఉన్న అవ‌కాశాల‌పై ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. తిరిగి వైసీపీలోకి వెళ్లే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఉన్న వాటిల్లో కాస్త బెట‌ర్ గా ఉన్న జ‌న‌సేన‌లోకి జంప్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది. అన్ని అనుకూలిస్తే త్వ‌ర‌లో ప‌వ‌న్ కళ్యాణ్ స‌మ‌క్షంలో పార్టీలోకి చెర‌డానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితుల స‌మాచారం.

  ఇది చదవండి: అప్పటివరకు సరదాగా సాగిన జీవితం.. ఒక్కసారిగా తలకిందులైంది.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..


  Published by:Purna Chandra
  First published: