'బీజేపీలో చేరిక'పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్

టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలనూ ఆయన ఖండించారు. ఇందులో వాస్తవం లేదని సీఎం రమేష్ స్పష్టంచేశారు.

news18-telugu
Updated: June 14, 2019, 8:03 PM IST
'బీజేపీలో చేరిక'పై క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్
టీడీపీ ఎంపీ సీఎం రమేష్ (File)
news18-telugu
Updated: June 14, 2019, 8:03 PM IST
ఏపీలో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీలో లుకలుకలు మొదలయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీతో టచ్‌లో ఉన్నారన్న వార్తలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. అటు మిషన్ ఏపీలో భాగంగా టీడీపీలోని కీలక నేతలపై బీజేపీ దృష్టిసారించిందని..త్వరలోనే వారంతా కమలం తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ జాబితాలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పు వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు.

పార్టీ మార్పుపై ఎవరూ తమను స్పందించలేదని సీఎం రమేష్ స్పష్టంచేశారు. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదని..పార్టీ మారే అవసరం టీడీపీలో ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదన్న సీఎం రమేష్..మీడియాలో వస్తున్న కేవలం కల్పితాలేనని కొట్టిపారేశారు. ఇక టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలనూ ఆయన ఖండించారు. ఇందులో వాస్తవం లేదని సీఎం రమేష్ స్పష్టంచేశారు.


First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...