SPECULATIONS OVER MAMATA BANERJEE RESIGNATION AS UTTARAKHAND CM TIRATH SINGH RESIGNS ON 6 MONTH RULE SK
West Bengal: మమత బెనర్జీకి పొంచి ఉన్న పదవి గండం.. సీఎం పదవికి రాజీనామా చేస్తారా?
మమత బెనర్జీ
మే 5న ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ.. నవంబరు 4 లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. కానీ పశ్చిమ బెంగాల్లో మండలి లేనందున ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే గెలవాలి. ఐతే రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నిక సంఘం ముందుకు రావడం లేదు.
ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రాజీనామా వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సీఎంగా బాధ్యతలు చేపట్టి 4 నెలలు తిరగక ముందే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం.. శుక్రవారం రాత్రి రాజీనామా చేశారు. తీరథ్ సింగ్ మార్చిలోనే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి ఆయన ఎమ్మెల్యే కాదు.. ఎంపీ. ఐతే త్రివేంద్ర సింగ్ రావత్‌పై ఆరోపణలు రావడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తి చేయడంతో.. ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. త్రివేంద్ర సింగ్ స్థానంతో తీరథ్‌ను గద్దెనెక్కించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా గెలవాలి. అప్పుడే ఆయన సీఎంగా కొనసాగుతారు. ఉత్తరాఖండ్‌లో శాసన మండలి లేనందున.. నేరుగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవాల్సిన పరిస్థితి. సెప్టెంబరు 10 వరకు ఆయనకు గడువు ఉంది. అప్పటిలోగా శాసన సభకు ఎన్నికవ్వాలి. ఉత్తరాఖండ్‌లో ఖాళీగా ఉన్న గంగోత్రి, హల్ద్వానీ నుంచి పోటీ చేసి గెలవచ్చు. కానీ కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గడువులోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుంటే రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉండడంతో.. ఆ పరిస్థిితి రాకుండా ముందుగానే బీజేపీ పెద్దలు తీరథ్ సింగ్ రావత్‌తో రాజీనామా చేయించారు. దీనికి తోడు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ రాజీనామా చేయడంతో అదే పరిస్థితి పశ్చిమ బెంగాల్లోనూ నెలకొనే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తిరుగులేని విజయం సాధించినా.. సీఎం మమతా బెనర్జీ మాత్రం ఓడిపోయారు. నందిగ్రామ్ నియోజవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా మమతా బెనర్జీ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు. ఐతే సీఎంగా ప్రమాణస్వీకాం తర్వాత ఆరు నెలల్లోగా ఆమె అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. అందుకోసం భవానీపూర్ నియోజవర్గ తృణమూల్ ఎమ్మెల్యే రాజీనామా చేసి.. ఆమెకు అనుకూల వాతావరణం కల్పించారు. మే 5న ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ.. నవంబరు 4 లోగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. కానీ పశ్చిమ బెంగాల్లో మండలి లేనందున ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే గెలవాలి. ఐతే రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నిక సంఘం ముందుకు రావడం లేదు.
అంతేకాదు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల తర్వాతే కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని..కోర్టులు ఇప్పటికే ఎన్నికల సంఘంపై మొట్టి కాయలు వేశాయి. కరోనా ఉద్ధృతి సమయంలో ఎన్నికలు నిర్వహించడం అవసరమా ? అని మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సుముఖంగా లేదు. మన దేశంలో మళ్లీ ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయో? ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం ఎప్పుడు ఏర్పడుతుందో? చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయా? అన్నది ప్రశ్నార్థమే. ఒకవేళ అదే జరిగితే ఉత్తరాఖండ్ సీఎంలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రాజీనామా చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు మమతను గద్దెదింపేందుకే బీజేపీ ఉత్తరాఖండ్ స్కెచ్ వేసిందని మరికొందరు అనుమానిస్తున్నారు. ముందుగా తమ సీఎంను తప్పించి.. ఆ తర్వాత మమతను తప్పించేందుకు వ్యూహాలు రచించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నవంబరు లోగా పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిలు జరుగుతాయా? లేదంటే మమత బెనర్జీ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయా? అనే దానిపై మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.