సీఎం జగన్‌కు కొత్త టెన్షన్.. అందుకే ఆ మార్పులు..?

డిప్యూటీ సీఎంలుగా ఉన్న పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ నాని, నారాయణస్వామి, అంజాత్ బాషాపై రోజురోజుకూ పనిభారం పెరుగుతోంది. తమకు కేటాయించిన శాఖలతో పాటు వారి సొంత జల్లాల్లో పార్టీ బాధ్యతలను కూడా వారికి అప్పగించనున్నారు. అందుకే వారికి ఇన్ ఛార్జ్ మంత్రుల బాధ్యత నుంచి విముక్తి కల్పించినట్లు సమాచారం.

news18-telugu
Updated: October 22, 2019, 8:35 PM IST
సీఎం జగన్‌కు కొత్త టెన్షన్.. అందుకే ఆ మార్పులు..?
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: October 22, 2019, 8:35 PM IST
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ ప్రతినిధి)
ఏపీలో జిల్లాలకు నియమించిన ఇన్ ఛార్జ్ మంత్రులను మూడు నెలల వ్యవధిలోనే సమూలంగా మార్చేస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.. వివిధ జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులుగా నియమించిన వారిపై వెల్లువెత్తిన ఆరోపణలే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది. దీంతో పాటు త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరి కొందరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులను మార్చినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో మహిళా మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రులకూ స్ధానం దక్కలేదు.

ఏపీలో వివిధ జిల్లాలకు బాధ్యులుగా నియమించిన ఇన్ ఛార్జ్ మంత్రులను కేవలం మూడు నెలల వ్యవధిలో సమూలంగా మారుస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది. ఇందులో ఐటీ, పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మినహా మిగతా మంత్రులందరికీ స్ధాన చలనం తప్పలేదు. చిత్తూరు జిల్లాకు బాధ్యుడిగా ఉన్న గౌతం రెడ్డికి మాత్రమే స్ధాన చలనం కలగలేదు. ఈ మార్పుల వెనుక మంత్రులపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు, డిప్యూటీ సీఎంలకు తమ శాఖలపై దృష్టిసారించేందుకు వీలుగా వెలుసుబాటు, జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కలుపుగోలుతనంగా ఉండలేని మహిళా మంత్రుల తీరు, త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికల దృష్టా సమీకరణాలు వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా తన కేబినెట్ లోని కొందరు మంత్రులపై వస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తీరు మార్చుకోవాలని ఇప్పటికే వీరిలో కొందరికి హెచ్చరికలు జారీ చేసిన జగన్.. తొలి దశలో వీరి బాధ్యతల్లో మార్పులు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం, అధికారుల నుంచి అందుతున్న నివేదికలను పరిశీలించిన మీదట జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇన్ ఛార్జ్ మంత్రుల మార్పు వెనుక మరో ప్రధాన కారణం త్వరలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా అని అర్ధమవుతోంది. వివిద జిల్లాలకు నియమించిన ఇన్ ఛార్జ్ మంత్రులు, స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులతో సమన్వయం చేసుకోవడంలో కొందరు విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు, సమీక్షలు, ఇతరత్రా కార్యక్రమాల్లో సమన్వయ లోపంతో అక్కడక్కడా సమస్యలు తలెత్తుతున్నట్లు సీఎం జగన్ కు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే స్ధానిక సంస్ధల ఎన్నికల నాటికి పరిస్దితి మరింత జటిలంగా మారుతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తాజా నివేదికల ఆధారంగా మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.మరోవైపు డిప్యూటీ సీఎంలుగా ఉన్న పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ నాని, నారాయణస్వామి, అంజాత్ బాషాపై రోజురోజుకూ పనిభారం పెరుగుతోంది. తమకు కేటాయించిన శాఖలతో పాటు వారి సొంత జల్లాల్లో పార్టీ బాధ్యతలను కూడా వారికి అప్పగించనున్నారు. అందుకే వారికి ఇన్ ఛార్జ్ మంత్రుల బాధ్యత నుంచి విముక్తి కల్పించినట్లు సమాచారం. అదే కోవలో గతంలో ఇన్ ఛార్జ్ మంత్రిగా వ్యవహరించిన హోంమంత్రి మేకతోటి సుచరితపై వచ్చిన ఆరోపణలు, ఇతరత్రా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆమెను బాధ్యతల నుంచి తప్పించినట్లు అర్ధమవుతోంది. అదే సమయంలో మరో మహిళా మంత్రి తానేటి వనితకూ ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...