Home /News /politics /

SPECULATIONS OVER CHANGES TO BE MADE IN ANDHRA PRADESH CABINET FULL DETAILS HERE PRN

AP Cabinet Changes: కేబినెట్ బెర్త్ కోసం ఊపందుకున్న లాబీయింగ్.. జిల్లాల వారీగా వినిపిస్తున్న పేర్లు ఇవే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొంతకాలంగా మంత్రివర్గ ప్రక్షాణళనపైనే (AP Cabinet Changes) చర్చ జరుగుతోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీలోని (YSRCP) ఇదే హాట్ టాపిక్. ఎవరికి మంత్రిపదవులు దక్కుతాయి.. ఎవరు పదవులు కోల్పోతారనేదానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొంతకాలంగా మంత్రివర్గ ప్రక్షాణళనపైనే (AP Cabinet Changes) చర్చ జరుగుతోంది. అటు అధికార వైఎస్ఆర్సీపీలో (YSR Congress Party) ఇదే హాట్ టాపిక్. ఎవరికి మంత్రిపదవులు దక్కుతాయి.. ఎవరు పదవులు కోల్పోతారనేదానిపైనే లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు ఆశావాహులు తాడేపల్లిచుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. మంత్రివర్గంపై ఇంత చర్చ జరుగుతున్నా సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan Mohan Reddy) మాత్రం తన మనసులోని మాటను మాత్రం బయటపెట్టలేదు. ఈ మధ్య మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Minister Balineni Srinivas Raddy) మాత్రం.. మంత్రివర్గంలో ఒక్కర్ని కూడా కొనసాగించరని చెప్పారు. ఒక విధంగా సీఎం జగన్ నిర్ణయం కూడా ఇదేనన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. కొందర్ని కొనసాగించి.. కొందర్ని తొలగిస్తే కొత్త తలనొప్పులు వచ్చే అవకాశమున్నందున.. అందర్నీ తొలగించేస్తే సమస్య ఉండదని భావిస్తున్నారట. ఐతే ఈ మార్పులు, చేర్పులకు ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు.

  మంత్రివర్గంలోకి ఎవర్ని తీసుకునేది సీఎం జగన్ సంకేతాలివ్వనప్పటికీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా కేబినెట్ కూర్పు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రాంతీయ, సామాజికవర్గ సమీకరణలు, పార్టీ కోసం పనిచేసిన వారితో జిల్లాల వారిగా లిస్ట్ సిద్ధం చేసి వారి నుంచి తుదిజాబితాను రూపొందిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, నేతలు ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు.

  ఇది చదవండి: జ్యోతిష్యురాలితో ఎమ్మెల్యే రోజా భేటీ.. మంత్రి పదవి కోసమేనా..?  శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) నుండి ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు కేబినెట్లో ఉండగా.. తమ్మినేని సీతారామ్ కేబినెట్ లో ఉన్నారు. తమ్మినేని మొదటి నుంచి మంత్రిపదవి ఆసిస్తున్నారు. అప్పలరాజు ఇటీవలే కేబినెట్లోకి రావడంతో ఆయన కొంతకాలం కొనసాగే అవకాశముందంటున్నారు. ధర్మాన కృష్ణదాస్ స్థానంలో ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్ బెర్త్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా (Vizianagaram District) లో సీనియర్ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర రేసులో ఉన్నారు. అయితే కోలగట్ల కుమార్తెకు విజయనగరం మేయర్ పదవి ఇవ్వడంతో ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్. ఎస్టీ మహిళకు మంత్రిపదవి ఇవ్వాలని భావిస్తే రాజన్నదొరకు ఈసారి కూడా మొండిచేయి తప్పదు.

  ఇది చదవండి: ఆ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..? జగన్ ప్రచార వ్యూహంపై టీడీపీలో చర్చ..!  విశాఖపట్నం (Visakhapatnam) నుంచి గుడివాడ అమర్ నాథ్, ఉమాశంకర్ గణేష్, కరణం ధర్మశ్రీ మంత్రిపదవులు ఆశిస్తున్నారు. మంత్రి అవంతి తప్పించడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. విశాఖ నుంచి మరికొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వైజాగ్ సిటీ నుంచి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే అమరనాథ్ కు గ్యారెంటీ. ఎస్టీ కోటాలో అరకు ఎమ్మెల్యే ఫల్గుణ, పాడేరు ఎమ్మల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కూడా పదవిని ఆశిస్తున్నారు. విశాఖ నగరానికి అవకాశం ఇవ్వాలనుకుంటే అమర్ నాధ్ కు ఛాన్స్ ఉంది. గిరిజన కోటాలో ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి కూడా మంత్రి పదవిని కోరుకుంటున్నారు.

  ఇది చదవండి: కీలక పదవుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు... లిస్టులో ఉన్న నేతలు వీళ్లేనా..?  తూర్పుగోదావరి జిల్లా (East Godavari District)నుంచి ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశముంది. ఇక్కడ ఒక ఎమ్మెల్సీకి మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారముంది. అలాగే బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) నుంచి ముగ్గురు మంత్రులున్నారు. వీరి స్థానంలో కాపు, క్షత్రీయులతో పాటు ఎస్సీలకు స్థానం కల్పించాల్సి ఉంది. ఆ లెక్కన ముదునూరి ప్రసాదరాజు, కాపు వర్గం నుంచి భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లేదా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టుసత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గం నుంచి తలారి వెంకట్రావు పేరు ప్రచారంలో ఉంది.

  ఇది చదవండి: ఏపీలో ప్రతిరోజూ కరెంట్ కోతలు.. సోషల్ మీడియాలో వైరల్.. ప్రభుత్వ రియాక్షన్  కృష్ణాజిల్లా (Krishna District) నుంచి మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అలాగే సామినేని ఉదయభాను, జోగి రమేష్, మంత్రిపదవిని ఆశిస్తున్నారు. బీసీ కోటాలో పార్థసారధి, జోగి రమేష్ మధ్య పోటీ నెలకొంది. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో కమ్మవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నందున మర్రి రాజశేఖర్ పేరు బలంగా వినిపిస్తోంది. గతంలోనే సీఎం జగన్.. మర్రికి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా (Guntur District) నుంచి ఎమ్మెల్యే ఆర్కే పేరు ప్రచారంలో ఉన్న ఆయన సోదరుడి అయోధ్యరామిరెడ్డి ఎంపీ కావడంతో ఆర్కేకు కేబినెట్ బెర్త్ అనుమానమే. జిల్లా నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజినీ, డిప్యూటీ స్పీకర్ కోనరఘుపతి, మైనార్టీ కోటాలో మహ్మద్ ముస్తాఫా మంత్రి పదివిని ఆశిస్తున్నారు. అంబటి రాంబాబు పేరు కూడా వినిపిస్తున్నా ఆయన విషయంలో సస్పెన్స్ తప్పేలాలేదు. ప్రకాశం జిల్లా (Prakasham District) మహీధర్‌రెడ్డి. అన్నా రాంబాబు కేబినెట్ రేసులో ఉన్నారు.

  ఇది చదవండి: జనసేనలోకి ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే..? పవన్ స్ట్రాటజీ ఇదేనా..?  నెల్లూరు జిల్లా (Nellore District) నుండి ఆనం రామనారాయణ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య మంత్రిపదవిని ఆశిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో (Chittoor District) మంత్రి పదవుల కోసం గట్టిపోటీ నెలకొంది. జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొనసాగించడం ఖాయమన్న ప్రచారాం సాగుతున్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కే రోజా మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. ఒకవేళ పెద్దిరెడ్డి కూడా తప్పిస్తే వీళ్లిద్దరిలో ఒకరికి పదవి గ్యారెంటీ అని తెలుస్తోంది.

  ఇది  చదవండి: ఆ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిన పీఏలు.., లెక్కల్లో తేడా రావడమే కారణమా..? అసలేం జరిగింది..?


  సీఎం సొంత జిల్లా యఅయిన కడప జిల్లా (Kadapa District) నుంచి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు పేర్లు ముందువరసలో ఉన్నాయి. సీ.రామచంద్రయ్య కూడా పదవి కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. అనంతపురం జిల్లా (Anantapuram District) జనుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, పెద్దారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి మహిళా కోటాలో ఉషశ్రీ చరణ్, జొన్నలగడ్డ పద్మావతి కేబినెట్లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

  ఇది చదవండి: వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు... సేమ్ టు సేమ్ పవన్ లాగానే..!


  కర్నూలు జిల్లా (Kurnool District) నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించే అవకాశం ఉండటంతో ఆయన స్థానంలో శిల్పా చక్రపాణిరెడ్డికి పదవి ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎవరెన్ని లెక్కలు వేసుకున్నా.. సీఎం జగన్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని వైసీపీ వర్గాలంటున్నాయి. త్వరలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఆ తర్వాతే కేబినెట్ పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  తదుపరి వార్తలు