Badvel By Election: బద్వేలులో పోటీకి బీజేపీ సై..? పవన్ సపోర్ట్ చేస్తారా..?

బద్వేలులో పోటీకి సిద్ధమవుతున్న బీజేపీ..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో జనసేన (Janasena Party), భారతీయ జనతాపార్టీలు (Bharatiya Janatha Party) మిత్రపక్షాలు. రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తులతో బరిలో దిగుతున్నాయి. బద్వేలు (Badvel By Election) విషయంలో మాత్రం మిత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జనసేన (Janasena), భారతీయ జనతాపార్టీలు (Bharatiya Janatha Party) మిత్రపక్షాలు. రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తులతో బరిలో దిగుతున్నాయి. ఎవరి సిద్ధాంతాలు వారివైనా.., రాజకీయంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఐతే మిత్రుల మధ్య అప్పుడప్పుడు విభేదాలు వస్తూనే ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నిక సమయంలో రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చాయి. అభ్యర్థిత్వం, ప్రచారం విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఏపీ బీజేపీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత వివాదాలు సమసిపోవడం, తిరుపతిలో బీజేపీ తరపున మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేసి ఓడిపోవడం అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత రెండు పార్టీలు కలిసి ముందుకెళ్తున్నాయి. తాజాగా మరోసారి రెండు పార్టీల మధ్య వివాదాలు నెలకొంటున్నాయి. దానికి కారణం బద్వేలు ఉపఎన్నిక (Badvel By Election) .

    కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఈనెల 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్సీపీ తరపున దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధను నిలబెట్టగా.. టీడీపీ తరపున ఓబుళాపురం రాజశేఖర్ ను బరిలో దింపుతున్నారు. బద్వేలు అభ్యర్థిత్వాన్ని బీజేపీ.. జనసేనకు ఇచ్చింది. ఐతే జనసేన మాత్రం బీజేపీకి షాకిచ్చింది.

    ఇది చదవండి: ఆ విషయంలో వైసీపీకి జనసేన సపోర్ట్.. స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్..


    బద్వేలు ఉపఎన్నికలో పోటీ చేయడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. శనివారం అనంతపురం జిల్లా కొత్తచెరువు బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్.. మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చినందున తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని.. ఏకగ్రీవం చేసుకోవాల్సిందిగా వైసీపీకి సూచించారు. దీంతో మిత్రపక్షం బీజేపీకి షాక్ తప్పలేదు.

    ఇది చదవండి: రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్.. పవన్ సంచలన వ్యాఖ్యలు..,



    పోటీ నుంచి జనసేన తప్పుకోవడంతో బీజేపీ రంగంలోకి దిగాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు సమావేశమవుతున్నారు. పోటీ చేయాలని బీజేపీ దాదాపు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఒకవేళ కమలనాథులు తమ అభ్యర్థిని బరిలో దింపితే పొత్తు ధర్మం ప్రకారం పవన్ కల్యాణ్ మద్దతిస్తారా..? బీజేపీకి అనుకూలంగా జనసైనికులు ప్రచారం చేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

    ఇది చదవండి: కాపులకు పవన్ కల్యాణ్ హితబోధ.. ఆ ముగ్గురిపై ఆసక్తికర వ్యాఖ్యలు


    మరోవైపు జనసేన పోటీ నుంచి తప్పుకుంటే బీజేపీ ఎలా పోటీ చేస్తుందన్న చర్చకూడా జరుగుతోంది. మిత్రపక్షం నిర్ణయానికి విరుద్ధంగా పోటీ చేయడాన్ని ఓ వర్గం తప్పుబడుతోంది. ఇప్పటికే జనసేనకు, బీజేపీకి మధ్య సఖ్యత కొరవడిందని.. రెండు పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో సమన్వయం లేదు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ ఎవరికి వారే అనే రీతిలో వ్యవహరించారు. కొన్నిచోట్ల ఉమ్మడి అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయాయి. బద్వేలు వ్యవహారంలో రెండు పార్టీల మధ్య సందిగ్ధపరిస్థితి నెలకొంది. ఈ బీజేపీ పోటీకి దించితే పవన్ ఎలా స్పందిస్తారు..? బద్వేలులో వచ్చిన అభిప్రాయబేధాలు.. ఇప్పటికే పరితమితమవుతాయా..? లేక భవిష్యత్తులోనూ కొనసాగుతాయా...? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
    Published by:Purna Chandra
    First published: