SPECULATIONS ON ONE MINISTER IN AP CABINET WILL GET FULL TERM CHARGE AFTER YS JAGAN TOOK KEY DECISION FULL DETAILS HERE PRN
AP Cabinet: ఆ మంత్రికి ముందుగానే వరమిచ్చిన సీఎం జగన్..? ఐదేళ్లు పదవికి ఢోకా లేనట్లేనా..?
వైఎస్ జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రిbర్గంలో (AP Cabinet) మార్పులు, చేర్పులపై గత కొన్ని నెలలుగా విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చేస్తాన.. ప్రమాణ స్వీకారం సమయంలోనే సీఎం జగన్ ( AP CM YS Jagan) మంత్రులకు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రిbర్గంలో (AP Cabinet) మార్పులు, చేర్పులపై గత కొన్ని నెలలుగా విపరీతమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చేస్తాన.. ప్రమాణ స్వీకారం సమయంలోనే సీఎం జగన్ ( AP CM YS Jagan) మంత్రులకు స్పష్టం చేశారు. అందుకు తగ్గట్లుగానే మంత్రిపదవులు ఇచ్చారు. ఇటీవలే ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేస్తుంది. దీంతో ఏ క్షణాన్నైనా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారన్న ప్రచారం జరిగింది. వంద శాతం మంత్రులను మార్చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అలా కాదు కొందరిని మాత్రమే మారుస్తారని చెబ్తున్నారు. అలా కాదు ఎనిమిది మందిని కొనసాగిసించి మిగిలిన వారిని మారుస్తారని.. లేదంటే ఎనిమిది మందినే తప్పిస్తారన్న వార్తలు వచ్చాయి. ఐతే వీటన్నింటిపైనా ప్రభుత్వం వైపు నుంచి గానీ, పార్టీ వైపు నుంచి గానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.
మంత్రివర్గంలో కొనసాగించే పేర్లు కూడా కొన్ని ప్రచారంలోకి వచ్చినా ఎలాంటి స్పష్టత లేదు. ఐతే ఇటీవల సీఎం జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఒక మంత్రికి మాత్రం ఆనందాన్ని కలిగిస్తోంది. మంత్రివర్గాన్ని మార్చినా ఆ మంత్రికి మాత్రం ఢోకా ఉండద్న ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఎవరో కాదు రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని. ఇటీవల సీఎం తన దగ్గరున్న సినిమాటోగ్రఫీ శాఖను పేర్ని నానికి బదిలీ చేశారు. సినిమా టికెట్ల ఆన్ లైన్ విక్రయం, ధరల విషయంలో సినీ హీరోలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పేర్ని నాని చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే నాని పనితీరు మెచ్చిన జగన్.. సినిమాటోగ్రఫీ శాఖను ఆయన చేతుల్లో పెట్టారు.
మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చలు జరుగుతున్న ఈతరుణంలో అదనపు శాఖను అప్పగించడంతో పేర్ని నాని పదవికి మరో రెండున్నరేళ్లు ఢోకా లేదన్న చర్చ కూడా జరుగుతోంది. మంత్రివర్గంలో కొనసాగే అతికొద్దిమందిలో పేర్ని కూడా ఉంటారని వైసీపీ నేతలంటున్నారు. పార్టీ వాయిస్ తో పాటు ప్రతిపక్షాల విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొడుతుండటం పేర్ని నానికి ప్లస్ అయిందన్న మాట వినిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మధ్యలో ఇద్దరు మంత్రుల స్థానాలను భర్తీ చేసినప్పుడు శాఖల్లో మార్పులు జరిగాయి. అదనపు పొందడం మాత్రం కొందరికే సాధ్యమైంది. గతంలో మేకపాటి గౌతమ్ రెడ్డికి అదనపు శాఖను ఇచ్చిన సీఎం... ఇప్పుడు పేర్ని నానికి మాత్రమే అదనపు బాధ్యతలిచ్చారు. మరి అదనపు శాఖ కేటాయింపు వెనుక కొనసాగింపు నిర్ణయం ఉందా..? లేదా..? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.