Tirupati By-Election: ఆ నేతను టెన్షన్ పెట్టిస్తున్న తిరుపతి ఉఎన్నిక ఫలితం.. ఇప్పటికే తలంటిన అధిష్టానం..?

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తిరుపతి ఉపఎన్నిక (Tirupati By Election) వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మరికొన్నిరోజుల్లో ఫలితాలు వెలువడనున్నందున ఓ పార్టీ నేతల్లో గుబులు నెలకొంది.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డాయి. ఈ నేపథ్యంలో గట్టిపోటీ ఇచ్చేందుకు జనసేన-బీజేపీ కూటమి కూడా గట్టిగానే ప్రయత్నించింది. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభతో పాటు ముఖ్యనేతలంతా తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేశారు. ఐతే ఏ.పి బీజేపీ అధ్యక్షుడి పాలిట ఈ తిరుపతి ఉపఎన్నిక శరాఘాతంకానుందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. కేంద్ర నాయకత్వానికి రాష్ట్రంలో పార్టీ వాపుని చూపించి బలమని నమ్మించే ప్రయత్నం చేశారనే చర్చ పార్టీ వర్గాలలో సాగుతోంది. తిరుపతి ఉపఎన్నికల్లో అంతా తానై ముందుండి నడిపిన సోము వీర్రాజు అటు అభ్యర్ధి ఎంపిక విషయంలోను., ఇటు మిత్రపక్షమైన జనసేనను కలుపుకుని వెళ్ళడంలో పూర్తిగా విఫలం చెందారని, పైగా పార్టీకి లేని బలం ఉన్నట్లుగా చూపించి తిరుపతిలో మనం గెలవబోతున్నామంటూ భాజపా జాతీయ నాయకులను నమ్మించి వారిని ఇక్కడ ప్రచారానికి రప్పించారని తెలుస్తోంది.

  తిరుపతిలో ప్రచారం సందర్భంగా అక్కడి ప్రజల స్పందన చూసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అక్కడికక్కడే వీర్రాజుపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారని విశ్వసనీయ సమాచారం. కనీసం బూత్ లెవల్ కమిటీలు కూడా వేయటం చేతగాని నీవు, ఇక్కడ మాతో ప్రచారం చేపించి మా పరువు తీస్తావా అంటూ చిందులు తొక్కారంట..!! మరో వైపు మొదటి నుండి సోము వీర్రాజుపై గుర్రుగా ఉన్న మిత్రపక్షం ఫిర్యాదులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తమ పార్టీ గుర్తు గాజు గ్లాసు వేరే పార్టీకి కేటాయించకుండా చూడటంలో రాష్ట్ర నాయకత్వం విఫలంఐందని ఆ పార్టీ నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదుకూడా చేయడం జరిగింది.

  ఇది చదవండి: ఆ నేతను టెన్షన్ పెట్టిస్తున్న తిరుపతి ఉఎన్నిక ఫలితం.. ఇప్పటికే తలంటిన అధిష్టానం..?

  ఇక సాధారణంగా అధికారపార్టీ సిట్టింగ్ సీట్ పైగా ఆ పార్టీకి బలమైన కేడర్ ఉండటంతో గెలుపు నల్లేరు మీద బండి నడకే అని చెప్పవచ్చు. అలాంటప్పుడు ఏదో నామమాత్రంగా పోటీ చేసి మమ అనిపించుకుంటే సరిపోయేదానికి మాతో ప్రచారం చేపించి రేపు అక్కడ తమ అభ్యర్ధి ఓడిపోతే తమ పరపతి ఏంకావాలి అని ఢిల్లీ నుండి ప్రచారానికి వచ్చిన కొందరు పెద్దలు సోమూకి ఫోనులోనే తలంటారంట. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తే తిరుపతి ఉపఎన్నికల ఫలితాల తర్వాత సోము వీర్రాజుకు మాత్రం పదవీగండం మాత్రం తప్పేలా లేదని పార్టీ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తేలాలంటే ఫలితాలు వచ్చేవరకు ఆగాల్సిందే.
  Published by:Purna Chandra
  First published: