ఎస్పీజీ భద్రత కేవలం ప్రధానికి మాత్రమే : చట్ట సవరణపై లోక్‌సభలో అమిత్ షా

ఎస్పీజీ భద్రత కేవలం ప్రధానికి,ఆయనతో పాటు ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. లోక్‌సభలో ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో అమిత్ షా మాట్లాడారు.

news18-telugu
Updated: November 27, 2019, 5:38 PM IST
ఎస్పీజీ భద్రత కేవలం ప్రధానికి మాత్రమే : చట్ట సవరణపై లోక్‌సభలో అమిత్ షా
లోక్‌సభలో అమిత్ షా
  • Share this:
ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ) అసలు ఉద్దేశ్యాన్ని గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో పునరుద్ఘాటించారు. అవసరమైన భద్రతా చర్యలు చేపట్టిన తర్వాతే గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించామన్నారు. గాంధీ కుటుంబానికి Z+ సెక్యూరిటీ సరిపోతుందన్నారు. ఎస్పీజీ భద్రత కేవలం ప్రధానికి,ఆయనతో పాటు ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. లోక్‌సభలో ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో అమిత్ షా మాట్లాడారు.

మాజీ ప్రధానమంత్రికి, అధికారిక నివాసంలో వారితో పాటు ఉండే కుటుంబ సభ్యులకు కూడా ఐదేళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించనున్నట్టు తెలిపారు. మాజీ ప్రధానమంత్రులకు 1985లో బీర్బల్‌నాథ్ కమిటీ ఎస్పీజీ సిఫారసులు చేసిందని.. 1988లో ఎస్పీజీ చట్టం అమలులోకి వచ్చిందని అన్నారు. ఆ తర్వాత 1991,94,99,2003లో ఎస్పీజీ చట్టానికి సవరణలు చేసి దాని అసలు ఉద్దేశ్యాన్ని నీరుగార్చారని అన్నారు.

ఎస్పీజీ భద్రత కల్పించే విషయంలో గతంలో ఎలాంటి కటాఫ్ లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధానికి ఎన్నేళ్లు ఎస్పీజీ భద్రత ఉండాలి..? ఆయన కుటుంబ సభ్యుల్లో ఎంతమందికి ఆ భద్రత కల్పించాలి? అనేదానిపై ఎలాంటి కటాఫ్ లేదన్నారు. దీంతో ప్రధానమంత్రి భద్రతపై కూడా ఇది ప్రభావం చూపుతోందన్నారు. కాబట్టే ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశామని తెలిపారు.

కాగా,మే21,1991లో గాంధీ కుటుంబాన్ని ఎల్టీటీఈ ఉగ్రవాదులు హత్య చేసినప్పటి నుంచి గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత కొనసాగుతూ వస్తోంది. దాదాపు 28 ఏళ్లుగా కొనసాగిన ఆ భద్రతను ఇటీవలే బీజేపీ ప్రభుత్వం తొలగించింది. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగించడంపై ఆ పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా సరే బీజేపీ సోమవారం ఎస్పీజీ చట్ట సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
First published: November 27, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading