వైఎస్ విజయమ్మ, షర్మిలకు కోర్టు నోటీసులు

news18-telugu
Updated: January 7, 2020, 7:03 AM IST
వైఎస్ విజయమ్మ, షర్మిలకు కోర్టు నోటీసులు
అన్న జగన్, తల్లి విజయమ్మతో షర్మిల(pic: ToI)
  • Share this:
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు కోర్టు నోటీసులు అందించింది. 2012 నాటి కేసులో ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వారితో పాటు ఏ3, ఏ4లుగా ఉన్న అప్పటి పరకాల వైసీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 10న ప్రత్యేక న్యాయస్థానంలో వీరంతా హాజరు కావాల్సి ఉంది.  ముందస్తు అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరకాల పోలీస్‌స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. మరోవైపు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ కూడా అదే రోజు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంది. జగన్ కుటుంబసభ్యులకు ఇలా కోర్టు నోటీసులు అందడం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
First published: January 7, 2020, 7:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading