మీ కళ్లలో కళ్లు పెట్టి... ఎంపీ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి... మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలని ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: July 25, 2019, 3:52 PM IST
మీ కళ్లలో కళ్లు పెట్టి... ఎంపీ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆజం ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
లోక్ సభ ప్యానల్ స్పీకర్‌గా ఉన్న రమాదేవిపై సమాజ్‌వాదీ ఎంపీ ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవిని ఉద్దేశించి... మీ కళ్లలో కళ్లు పెట్టి మాట్లాడాలని ఉందని వ్యాఖ్యానించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఆజం ఖాన్ వ్యాఖ్యాపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పీకర్ స్థానంలోకి వచ్చిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆజం ఖాన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరాలని సూచించారు. అయితే తానేమీ తప్పుగా మాట్లాడలేదని... తాను తప్పుగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆజం ఖాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఆజం ఖాన్ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్... తమ పార్టీ సభ్యుడిని వెనకేసుకొచ్చారు.


First published: July 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు