Home /News /politics /

SP BSP NEW EQUATION ON BJP VICTORY IN UP ASSEMBLY RESULTS SNR

మేం ఓడిపోలేదు..బీజేపీ గెలిచింది అంతే యూపీ ఫలితాలపై ఎస్పీ, బీఎస్పీ కవరింగ్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Uttar Pradesh:యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కూడా గెలుపుగానే భావిస్తున్నాయి విపక్ష పార్టీలు. బీజేపీ గెలవడాన్ని అంగీకరించలేకపోతున్న ఎస్పీ తమకు ఓట్ల శాతం పెరిగిందని సంతృప్తి చెందుతోంది. బీఎస్పీ తమ అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయంటూ కవర్ చేసుకుంటున్నాయి.

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Election results)విపక్షాలకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. అధికార పార్టీ బీజేపీ హవా ముందు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సమాజ్‌వాది(Samajwadi)పార్టీ, బహుజన్ సమాజ్ (Bahujan Samaj Party)పార్టీ అడ్రస్ గల్లంతైపోయాయి. గెలుపుపై కోటి ఆశలు పెట్టుకున్న రెండు పార్టీలు పరాజయం పాలయ్యాయి. ఓటమిని అంగీకరిస్తూనే ఎస్పీ బీజేపీ(BJP)పై పైచేయి సాధించామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల ఫలితాలతో పోలిస్తే తమకు రెండున్నర రెట్లు అధిక సీట్లను కట్టబెట్టారంటూ యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్ (Akhilesh Yadav). అంతే కాదు ఇకపై బీజేపీ సీట్లను తగ్గించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీపై భ్రమలు మొత్తం తొలగిపోతాయన్న అఖిలేష్ బీజేపీ సీట్లను కూడా తగ్గించవచ్చనే విషయాన్ని నిరూపించామన్నారు.ఈసారి జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి ఘనవిజయం సాధించింది. 403 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 273నియోజకవర్గాలను బీజేపీ తన మిత్రపక్షంతో కలిసి కైవసం చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ 125 స్థానాల్లో విజయం సాధించింది. గత 2017అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 49 స్థానాలు తగ్గాయి. సమాజ్ వాదీ పార్టీ 73 అధిక స్థానాలను కైవసం చేసుకుంది.ఈ పరిణామాన్ని ప్రజలకు వివరిస్తూనే ఫలితాల్లో ఎదురైన ఓటమిని కవర్ చేసుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ సీట్లను రెండున్నర రెట్లు, ఓట్ల శాతాన్ని ఒకటిన్నర రెట్లు పెంచినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్(Tweet) చేశారు అఖిలేష్‌ యాదవ్. రాబోయే రోజుల్లో మొత్తం భ్రమలు తొలగిపోతాయన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం జరిగే పోరాటమే చివరకు గెలుస్తుందంటూ ట్వీట్‌ ద్వారా ఫలితాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు అఖిలేష్‌ యాదవ్.

ఓడినా గెలిచినట్లుగా ఫీలింగ్..
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం అసామాన్యం కాదని విపక్షాలు అర్ధం చేసుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఎస్పీ, బీఎస్పీ గతంలో అధికారం చేపట్టిన పార్టీలే. అలాంటి రెండు పార్టీలను 2017, 2022 ఎన్నికల్లో ఓడించిన బీజేపీని తక్కువ అంచనా వేయడమే కాకుండా సీట్లు తగ్గించగలిగాం, ఓట్ల శాతం పెంచుకున్నామని అఖిలేష్ యాదవ్ సమర్దించుకోవడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

ఇంకోసారి ట్రై చేస్తే పోలా..
సమాజ్‌వాది పార్టీ సంగతి పక్కన పెడితే బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒక్క సీటు గెలవడంపై కూడా పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. మాయావతి బీఎస్పీకి 1, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించి కనీసం డబుల్ డిజిట్‌ని సంపాధించుకోలేకపోవడం దురదృష్టకరమైన పరిస్థితిగా అభివర్ణిస్తున్నారు. అయితే బీఎస్పీ నాయకురాలు మాయావతి మాత్రం ఫలితాలు తమ పార్టీ అంచనాలకు విరుద్ధంగా వచ్చాయన్నారు. అయితే వీటిపై నిరాశ‌చెంద‌రాద‌న్నారు. ఈ ఫ‌లితాల నుంచి గుణ‌పాఠం నేర్చుకోవాల‌ని, ఆత్మావ‌లోక‌నం చేసుకొని పార్టీ వ్య‌వ‌హారాల‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాల‌ని ఆమె తెలిపారు.
ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో ఎస్పీ, బీఎస్పీ బీజేపీ విజయాన్ని చిన్నదిగానే చూస్తూ సంతృప్తి చెందుతున్నట్లుగా కనిపిస్తోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Akhilesh Yadav, Assembly Election 2022, Bjp, Bsp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు