SP BSP Alliance: ఎస్పీ-బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు...సమాన స్థానాల్లో పోటీ

SP BSP ALLIANCE : ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీని అధికారంలోకి రానివ్వమని మాయావతి పునరుద్ఘాటించారు.

news18-telugu
Updated: January 12, 2019, 2:15 PM IST
SP BSP Alliance: ఎస్పీ-బీఎస్పీ మధ్య పొత్తు ఖరారు...సమాన స్థానాల్లో పోటీ
జాయింట్ ప్రెస్ మీట్‌లోమాయావతి, అఖిలేష్ యాదవ్ ఫైల్ ఫోటోస్
  • Share this:
రాజకీయాల్లో శాశ్విత శత్రువులు, శాశ్విత మిత్రులు ఎవరూ ఉండరన్న నానుటి మరోసారి నిజమైయ్యింది. ఉమ్మడి శత్రువు బీజేపీని దెబ్బకొట్టేందుకు...ఒకనాటి శత్రువులైన ఎస్పీ-బీఎస్పీ మళ్లీ చేతులు కలిపాయి.  రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ బీఎస్పీ మధ్య పొత్తు ఖరారయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ శనివారం జరిగిన ఉమ్మడి ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. మొత్తం 80 స్థానాలకు గాను చెరో 38 స్థానాల్లో రెండు పార్టీలు పోటీ చేయబోతున్నట్టు తెలిపారు. మిగతా రెండు స్థానాలను తమ కూటమిలో చేరే మిగిలిన పార్టీలకు విడిచిపెడుతున్నట్లు తెలిపారు. అటు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకున్నా అమేథీ, రాయ్‌బరేలీలో ఎస్పీ, బీఎస్పీ పోటీ చేయబోమని వెల్లడించారు.

ఎస్పీ-బీఎస్పీ పొత్తుతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇక నుంచి నిద్ర లేని రాత్రులే. మోదీ నేత్రుత్వంలో దేశంలో ప్రగతి క్షీణించింది, ప్రజలంతా బీజేపీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా.. ప్రస్తుతం ఎస్పీ-బీఎస్పీ కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీని అధికారంలోకి రానివ్వం. కాంగ్రెస్‌తో పొత్తు ద్వారా ఎస్పీ-బీఎస్పీలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అందుకే పొత్తు నుంచి ఆ పార్టీని దూరంగా ఉంచాం. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది, అందుకే కేసుల పేరుతో అఖిలేశ్ యాదవ్‌ను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
మాయావతి, బీఎస్పీ అధినేత్రి


sp bsp, sp bsp alliance in up, akhilesh yadad, mayawati, samajwadi party, bsp, ఎస్పీ బీఎస్పీ, యూపీలో ఎస్పీ బీఎస్పీ పొత్తు, అఖిలేష్ యాదవ్, మాయావతి
జాయింట్ ప్రెస్ మీట్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్


ఎస్పీ-బీఎస్పీ పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికలకే పరిమితం కాబోదని భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని మాయావతి చెప్పారు. అనంతరం ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తమతో పొత్తుకు ముందుకు వచ్చినందుకు మాయావతి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పాలనలో మైనారిటీ వర్గాలన్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. మోదీ అవలంభిస్తున్న విభజించి పాలించు సూత్రీకరణ 2019 లోక్‌సభ ఎన్నికల్లో విఫలం కాబోతుందని చెప్పారు. నిరుద్యోగ యువత మోదీ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. మోదీ పాలనను అంతం చేయడానికే ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపాయని చెప్పారు. తమ పొత్తుపై బీజేపీ దుష్ప్రచారాలకు పాల్పడుతోందని.. ఓటమి భయం వల్లే ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: అత్యంత గోప్యంగా ఈబీసీ... మోదీ మార్క్ చూపించారా ?

ప్రధాని అభ్యర్థిగా మాయావతికి మీ మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు అఖిలేశ్ ఆసక్తికర బదులిచ్చారు. ఉత్తరప్రదేశ్ దేశానికి ఎప్పుడూ ప్రధానులను అందిస్తూనే ఉందని.. రాష్ట్రం నుంచి మరో నేత ప్రధాని కాబోతున్నారంటే తాము సంతోషిస్తామని చెప్పారు. పరోక్షంగా మాయావతిని తమ ప్రధాని అభ్యర్థిగా అఖిలేశ్ స్పష్టం చేశారు.


బీజేపీ నేతలు మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడే తన మదిలో పొత్తు గురించి ఆలోచన మెదిలిందన్నారు అఖిలేశ్. మాయావతిపై ఆ కామెంట్స్ చేసినవారిని తప్పించాల్సిందిపోయి.. బీజేపీ వారికి మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. ఇప్పటినుంచి ఎస్పీ కార్యకర్తలంతా ఒక విషయం గుర్తుంచుకోవాలని.. మాయావతిని అగౌరవపరిస్తే.. అది తనను అగౌరవపరిచినట్టే అని చెప్పారు.BSP Chief Mayawati: We(BSP-SP) have decided to contest upcoming Lok Sabha elections together, this will lead to a new political revolution in the country. pic.twitter.com/eZcEf5Fq0f

First published: January 12, 2019, 12:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading