SONIA IS AGAIN THE LEADER OF THE DISSIDENTS WHO DEMANDED THE PURGE OF THE PRESIDENT SNR
CWC MEETING: మళ్లీ మేడమే చైర్ పర్సన్..సంస్థాగత ప్రక్షాళన కోరిన అసమ్మతి నేతలు
(మళ్లీ అధినేత్రికే పగ్గాలు)
CWC MEETING: మళ్లీ అదే జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అసమ్మతి నేతలు సంస్థాగత ప్రక్షాళన కోరితే..కాంగ్రెస్ విధేయులు మాత్రం అధినేత్రి సోనియాగాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు. ఐదు రాష్ట్రాల ఫలితాలపై సమావేశమైన మీటింగ్‌లో హాట్ హాట్ చర్చ జరిగింది.
మళ్లీ అదే టాపిక్. ఈసారి అదే సిస్ట్యూవేషన్. ఫైనల్‌గా వినిపించింది అదే స్వరం. ఐదు రాష్ట్రాల ఫలితాలను చూసిన తర్వాత ఏం చేయాలి అనే అంశంపై చర్చించుకునేందుకు ఏర్పాటు చేసిన భేటీలో అసమ్మతి నేతలు పాత పాటే పాడటం, దాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ హైకమాండ్ విన్నట్లు విని సమావేశాన్ని ముగించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఏం చేయాలన్న అంశంతో పాటు వరుసు ఎన్నికల్లో పరాజయం పాలవడానికి గల కారణాలపై విశ్లేషించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committee)సమావేశమైంది. సుమారు 4గంటలకుపైగా హాట్ హాట్‌గా జరిగిన సమావేశంలో సీనియర్ నేతలు, ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. ముందుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి కారణాలపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై కూడా మంతనాలు జరిపింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈభేటీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని సాక్షాత్తు సోనియాగాంధీ(Sonia Gandhi)కే చెప్పారు జీ23 అసమ్మతి నేతలు. అలాగే పూర్తిస్థాయి అధ్యక్షుడి నియమించాలని నేతలు డిమాండ్ చేశారు. మహరాష్ట్రకు చెందిన సీనియర్ నేత ముకుల్ వాస్నిక్(Mukul Wasnik)ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలన్న నిర్ణయాన్ని అసమ్మతినేతలు హైకమాండ్‌కి సూచించినట్లుగా సమాచారం.కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలను గాంధీయేతర వ్యక్తులకు కట్టబెట్టాల్సి వస్తే ముకుల్ వాస్నిక్‌కే అప్పగించాలని కోరినట్లుగా సమాచారం. మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్(Ashok Gehlot), కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Sivakumar)మాత్రం పార్టీ పగ్గాలను రాహుల్‌గాంధీకి అప్పగించాలని కోరినట్లుగా తెలుస్తోంది.
సంస్థాగత ప్రక్షాళనకు అసమ్మతి నేతల పట్టు..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా కాంగ్రెస్ ఎక్కడా అధికారం చేపట్టకపోగా.. పంజాబ్‌లో ఓడిపోయి పట్టు కోల్పోవడాన్ని హైకమాండ్ జీర్ణించుకోలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికతో పాటు పార్టీలో జరగాల్సిన సంస్థాగత ఎన్నికలను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగింది. వీటిలో ఏ అంశంపై హైకమాండ్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాజీనామాలు చేయవద్దంటూ ఏఐసీసీ కార్యాలయం ముందు కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసమ్మతి నేతల డిమాండ్, పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ సమావేశాన్ని ముగించింది.
మళ్లీ మేడమే చైర్ పర్సన్..
కాంగ్రెస్ పార్టీకి మరికొంత కాలం తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగుతారని పార్టీ సీనియర్ నేత మల్లికార్జునఖర్గే సీడబ్లూసీ సమావేశం అనంతరం చెప్పడం జరిగింది. ఆమె నాయకత్వంపై పార్టీలో అందరికి నమ్మకం ఉందన్న ఖర్గే అందుకే పార్టీ నేతలంతా సోనియాగాంధీకే మొగ్గు చూపారని చెప్పారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పూర్తి బాధ్యత కూడా సోనియాగాంధీనే తీసుకుంటారని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.