లాక్‌డౌన్ దెబ్బకు విలవిల్లాడుతున్న వలస కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సొంతూళ్లకు పయనమైన వాళ్లకు ఈ కఠిన సమయంలో ఆపన్న హస్తం అందిస్తామని ప్రకటించింది. డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలందరికీ ప్రయాణ ఖర్చులను భరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కేంద్రానికి లేఖ రాశారు. రైళ్ల ఖర్చులను కూడా అందించనున్నట్లు ఆమె తెలిపారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు వలస కార్మికులకు భరోసా ఇవ్వాలని ఈ సందర్భంగా సోనియా పిలుపునిచ్చారు.
వలస కార్మికులు దేశానికి వెన్నెముకగా అభివర్ణించిన కాంగ్రెస్ అధినేత్రి.. వారి కష్టం, త్యాగం మన దేశానికి పునాది అన్నారు. విదేశాల్లో ఉన్న వారిని ప్రత్యేక విమానాల్లో దేశానికి తీసుకొచ్చిన కేంద్రం.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని మాత్రం సొంతూళ్లకు తరలించలేకపోయిందని ఆరోపించారామె.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Lockdown, Railways, Sonia Gandhi