పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్దు విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. సిద్దూ పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వకూడదని అమరీందర్ సింగ్ హైకమాండ్‌కు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఆయన తీరును సిద్దూ తప్పుబట్టుతూ వచ్చారు. ఈ హైడ్రామా మధ్య కాంగ్రెస్ అధికష్టానం కీలక ప్రకటన చేసింది. పంజాబ్ పీసీసీ పదవిపై కొన్ని రోజులుగా నెలకొన్న ఊహాగానాలకు తెరదించింది. సిద్దూనే పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆదివారం రాత్రి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు సిద్దూతో పాటు మరో నలుగురిరి కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు వెలువరించారు.
Hon'ble Congress President Smt. Sonia Gandhi has appointed Shri Navjot Singh Sidhu as the President of the Punjab Pradesh Congress Committee with immediate effect. The party appreciates the contributions of outgoing PCC President, Shri Sunil Jakhar. pic.twitter.com/2lviyzwMuV
— Congress (@INCIndia) July 18, 2021
పంజాబ్ పీసీపీ పగ్గాలను ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్దూకు అప్పగించే విషయమై పార్టీలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పజెప్పేందుకు హైకమాండ్ సుముఖంగానే ఉన్నా.. సీఎం అమరీందర్ సింగ్ మాత్రం వ్యతిరేకిస్తూ వచ్చారు. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవికి ఇవ్వకూడదని ఇటీవల సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. పార్టీలో మొదటి నుంచీ ఉన్న వారిని, హిందూ, దళిత వర్గాలు చెందిన సీనియర్ నేతలు కాదని.. సిద్దూకు అధ్యక్ష పదవి ఇస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలపైనా తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.
కానీ, సీఎం అమరీందర్ సింగ్ అభ్యంతరాను పక్కనపెడుతూ నవజోత్ సింగ్ సిద్దూకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను సోనియా గాంధీ అప్పజెప్పారు. సిద్దూకు పీసీసీ పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్.. సంగట్ సింగ్ గిల్జియాన్, సుఖ్విందర్ సిండ్ డానీ, పవన్ గోయెల్, కుల్జిత్ సింగ్ నగ్రాను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. మరి సోనియా నిర్ణయంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Navjot Singh Sidhu, Punjab