ఆమె మీద కేసు ఉపసంహరించుకోవాలి.. సోము వీర్రాజు డిమాండ్..

బీజేపీ నేత సాదినేని యామిని మీద ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును ఉపసంహరించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: August 15, 2020, 4:31 PM IST
ఆమె మీద కేసు ఉపసంహరించుకోవాలి.. సోము వీర్రాజు డిమాండ్..
సాధినేని యామిని(ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీ నేత సాదినేని యామిని మీద ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసును ఉపసంహరించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ‘శతాబ్దల కల అయోధ్య లోని రామాలయం యొక్క శంకుస్థాపన. ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం. దీనిపై బిజెపి లో వున్న అనేక మంది ప్రస్తావించారు. యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు. ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.’ అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని టీటీడీపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలను టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద యామినిపై కేసు నమోదు చేశారు. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌లో రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని విమర్శలు చేశారు. ఈ పరిణామం హిందువులను మనోవేదనకు గురి చేస్తోందని ఆమె ఆరోపించారు. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అయితే ఆమె వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న టీటీడీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యామినిపై కేసు నమోదైంది.

కొద్ది రోజుల క్రితం ఇదే రకమైన విమర్శలు రావడంపై టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమలలో ప్రతి నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కటిన్నర గంట పాటు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. అయోధ్య రామమందిర శంకుస్థాపన సమయంలో ఎస్వీబీసీలో కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారమవుతోందని వివరణ ఇచ్చింది. కల్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతో మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని టీటీడీ తెలిపింది. కల్యాణోత్సవం కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని స్పష్టం చేసింది. ఆ కార్యక్రమాన్ని మరుసటి రోజు ఎస్వీబీసీలో ప్రసారం చేస్తున్నామని టీటీడీ తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 15, 2020, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading