• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SOMIREDDY CHANDRAMOHAN REDDY RESIGNATION ACCEPTED BY AP LEGISLATIVE COUNCIL CHAIRMAN NMD FAROOQ BA

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా, ఆమోదించిన చైర్మన్

ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా, ఆమోదించిన చైర్మన్

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (File)

2019 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ టికెట్ మీద నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నారు. ఒకవేళ ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఉంటుంది కదా అని సోమిరెడ్డిలో కూడా అలసత్వం లేకుండా ఉండేందుకే చంద్రబాబునాయుడు ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

  • Share this:
    ఏపీ ఎమ్మెల్సీ, వ్యవసాయ శాఖ మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పడంతో దాన్ని శాసనమండలి చైర్మన్ ఫరూక్ వెంటనే ఆమోదించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఆ నోటిఫికేషన్ రాకముందే ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తే, కొత్తవారిని శాసనమండలికి పంపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో చంద్రబాబు ఆదేశాలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

    Somireddy Chandramohan Reddy, Somireddy Chandramohan Reddy resign, Somireddy resign as MLC, MLC Resign, Somireddy resignation, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా, సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామా, సోమిరెడ్డి రాజీనామా
    ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి


    2019 ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ టికెట్ మీద నెల్లూరు జిల్లా సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని భావిస్తున్నారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసిన సోమిరెడ్డి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్దన్ రెడ్డి మీద 5,446 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మంత్రివర్గ విస్తరణలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

    Somireddy Chandramohan Reddy, Somireddy Chandramohan Reddy resign, Somireddy resign as MLC, MLC Resign, Somireddy resignation, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా, సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి రాజీనామా, సోమిరెడ్డి రాజీనామా
    సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి


    ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు అంత సీరియస్‌గా తీసుకోరనే భావన ఆయనలో నెలకొన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఉంటుంది కదా అని సోమిరెడ్డిలో కూడా అలసత్వం లేకుండా ఉండేందుకే చంద్రబాబునాయుడు ఈ ప్లాన్ వేసినట్టు చెబుతున్నారు. సోమిరెడ్డిలో సీరియస్‌నెస్ తీసుకురావడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్న వారిలో కొందరినైనా ఎమ్మెల్సీలుగా పంపొచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే, ఇటీవల కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు.

    పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా న్యాయవాదుల ర్యాలీ
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు