రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిరసనల్లో కొంతమంది కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆందోళనల్లో ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటివారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని.. అయితే శాంతియుత పద్దతిలో నిరసన తెలిపితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. రాజధాని ఆందోళనలపై ఇప్పటివరకు 12 కేసులు నమోదయ్యాయని, మీడియా ప్రతినిధులపై దాడి కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆదివారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇక హైపవర్ కమిటీలో తననూ సభ్యుడిగా చేర్చడంపై తనకెలాంటి సమాచారం అందలేదని గౌతమ్ నవాంగ్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలు, రక్షణ అంశాలకు సంబంధించి తన పేరును చేర్చి ఉంటారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డీజీపీ
కార్యాలయం ఎక్కడ ఉంటుందనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.